injured youth
-
వాషింగ్టన్లో కాల్పుల కలకలం... ఇద్దరికి గాయాలు
న్యూయార్క్: వాషింగ్టన్ లీస్ట్రీట్ వీధిలోని ఐడియా పబ్లిక్ చార్టర్ స్కూల్ బ్లాక్ వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతలో ఘటన జరిగినట్టు వాషింగ్టన్ పోలీస్ రాబర్ట్ కాంటె తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. 15 ఏళ్ల యువకుడు ఆ స్కూల్లోని ఇద్దరు విద్యార్థులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సదరు నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. అంతేకాదు ఆ స్కూల్లో ఉన్న దాదాపు 350 మంది విద్యార్థులను, స్కూల్ సిబ్బందిని ఈ విషయమై విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వాషింగ్టన్ డీసీ మెట్రోపాలిటన్ పోలీస్ చీఫ్ అధికారులు మాట్లాడుతూ...ఈ ఏడాది సుమారు రెండు వేల అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతేడాదితో పోల్చితే అదనంగా 800 అక్రమ ఆయుధాలు ఎక్కు ఉన్నాయన్నారు. అదే బుధవారం వేరొక ఘటనలో ఒక భవనం వద్ద మరో బాలుడు తుపాకీ కాల్పుల్లో మృతి చెందినట్లు తెలిపారు. (చదవండి: 20 ఏళ్ల యుద్ధానికి తెరపడిన రోజు... అఫ్గాన్‌లో మిన్నంటుతున్న సంబరాలు) -
బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకులు దుర్మరణం
హస్తినాపురం: బైక్ అదుపుతప్పి తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు ఘన్పూర్ మండలం, బస్వరాజ్‌పల్లి గ్రామానికి చెందిన పి.నవీన్(22) ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ వనస్థలిపురంలోని పద్మావతినగర్‌లో నివాసం ఉంటున్నాడు. అదే జిల్లాకు చెందిన అతడి స్నేహితుడు అడ్డూర్ పవన్‌కల్యాన్(22), కరీంనగర్‌కు చెందిన జె.శివ(23)ఉద్యోగం కోసం మూడు రోజుల క్రితం నవీన్ వద్దకు వచ్చారు. గురువారం రాత్రి హయత్‌నగర్‌లో ఉంటున్న మరో స్నేహితుడు నిమ్మల సాయి కుమార్ సాయికుమార్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు ముగ్గురు కలిసి హయత్‌నగర్ వెళ్లారు. పార్టీ అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా పద్మావతినగర్ కాలనీ మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నవీన్, పవన్ కల్యాన్ అక్కడికక్కడే మృతి చెందారు. శివకు స్వల్పగాయాలు కావడంతో స్థానికులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: పరారీలో యూట్యూబర్ కటారియా.. ఆచూకీ చెబితే రూ.25వేల రివార్డ్) -
ఘర్షణలో గాయపడిన యువకుడి మృతి
గుత్తి: గుత్తిలో మొహర్రం సందర్భంగా సోమవారం రాత్రి తలెత్తిన ఘర్షణలో గాయపడిన కుమార్(25) మంగళవారం మరణించినట్లు ఎస్ఐ చాంద్‌బాషా తెలిపారు. స్థానిక సీపీఐ కాలనీకి చెందిన కుమార్, రవి, మల్లికార్జున ఉప్పర వీధిలో చిందులు వేస్తుండగా వేణుగోపాల్ అనే వ్యక్తికి కుమార్ కాలు తగిలింది. దీంతో వారిద్దరి మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. కుమార్‌తో రవి, మల్లికార్జున జత కలసి వేణుగోపాల్‌తో గొడవకు దిగారు. దీంతో వేణుగోపాల్ తండ్రి నాగరాజు, స్నేహితుడు యుగంధర్ సైతం రంగంలోకి దిగారు. ఘర్షణ పెద్దదై పరస్పరం కొట్టుకున్నారు. అంతలోనే కొందరు మధ్యవర్తులు సర్దిజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే కాసేపయ్యాక వారు మళ్లీ పరస్పరం దాడులకు దిగారు. కట్టెలతో విచక్షణారహితంగా కొట్టడంతో కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. అక్కడి నుంచి బెంగళూరుకు మంగళవారం సాయంత్రం తరలిస్తుండగా కుమార్ మార్గమధ్యంలోనే మరణించాడన్నారు. దీంతో వేణుగోపాల్, నాగరాజు, యుగంధర్‌పై హత్య కేసు సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా కుమార్ ఏడాది కిందటే సుధారాణి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సుధారాణి ప్రస్తుతం గర్భిణి. భర్త మృతి చెందడంతో ఆమె కన్నీరు మున్నీరుగా విలపించడం అందరినీ కలచివేసింది.