వాషింగ్టన్: అమెరికాలోని అయోవా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా చాలా కౌంటీలు నీటముగిగాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల సాయంతో బయటకు తీసుకువచ్చేందకు ప్రయత్నాలు చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. అయోవా రాష్ట్రంలో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, కౌంటీల్లో వరద నీరు చేరుతుండటంతో పెద్ద సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక, దాదాపు 4,200 మంది జీవించే రాక్‌వ్యాలీ ప్రాంతంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. సమీపంలోని రాక్ నది పొంగిపొర్లుతోంది. దీంతో సైరన్లు మోగించి, ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద నీరు కారణంగా ప్రజలకు తాగునీరు కూడా అందుబాటులో లేకుండాపోయింది.
Floods in Iowa prompted evacuations due to heavy rain, with Rock Valley facing severe infrastructure strain.
Governor Kim Reynolds declared a disaster in 21 counties, including Sioux County.
South Dakota declared an emergency as Canton received significant rainfall.… pic.twitter.com/F4WNXcD3iQ— Breaking News (@TheNewsTrending) June 23, 2024
మరోవైపు.. వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు హెలికాప్టర్లను రప్పించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. అయితే బాధితుల వద్దకు బోట్లు చేరుకోగలగడంతో హెలికాప్టర్లు వెనుదిరిగాయి. ఇక్కడ ఉన్న 21 కౌంటీల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. సియూక్స్ కౌంటీ మొత్తం జలమయమైంది. ఎక్కడా వీధులు కనిపించడంలేదు. ఇళ్ల పైకప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక సౌత్ డకోటా రాష్ట్రంలో కూడా ఎమర్జెన్సీ ప్రకటించారు. మరోవైపు.. రాష్ట్ర ఆగ్నేయ ప్రాంతంలో సోమ, మంగళవారాల్లో ఇక్కడి నదులకు భారీగా వరద రావచ్చని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా.. అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. 1936 తర్వాత ఆ స్థాయిలో వేడిని చవిచూస్తున్నారు. వాషింగ్టన్ డీసీలో 37.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రిచ్‌మాండ్, వర్జీనియా, ఫిలడెల్ఫియా, న్యూజెర్సీ, కొలంబస్, ఒహాయో, డెట్రాయిట్‌లో వేడి 32 డిగ్రీలు దాటింది. దీంతో, ప్రజలు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment