![President Joe Biden Nominates Radha Iyengar To Top Pentagon Position - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/17/Untitled-4.jpg.webp?itok=CLaowN9R)
వాషింగ్టన్: ఇండియన్ అమెరికన్, భద్రతా నిపుణురాలు రాధా అయ్యంగార్ ప్లంబ్‌కు అమెరికా ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. రక్షణ శాఖ డిప్యూటీ అండర్ సెక్రటరీగా బైడెన్ సర్కారు ఆమెను నామినేట్ చేసింది. ఆమె ప్రస్తుతం రక్షణ శాఖలో అండర్ సెక్రటరీకి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఉన్నారు. మరో ఇండియన్ అమెరికన్ గౌతమ్ రానా స్లొవేకియాలో అమెరికా రాయబారిగా నియమితులు కానున్నారు.
అసలు ఎవరు ఈ రాధా అయ్యంగార్ ?
ఎకనామిక్స్‌లో ఎంఎస్, పిహెచ్‌డి పూర్తి చేసిన ఆమె లండన్ స్కూల్ ఆప్ ఎకనామిక్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానూ పని చేశారు. రాధా అయ్యంగార్ ప్రస్తుతం డిఫెన్స్ డిప్యూటీ సెక్రటరీ చీఫ్ స్టాఫ్‌గా వ్యవహరిస్తున్నారు. చీఫ్‌స్టాఫ్‌గా నియమకానికి ముందు.. ఆమె ప్రముఖ సంస్థ అయిన గూగుల్‌లో ట్రస్ట్ అండ్ సేఫ్టీ కోసం రీసెర్చ్ అండ్ ఇన్‌సైట్స్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment