
వాషింగ్టన్: నేటి రాత్రి ఆకాశంలో గొప్ప ఘటన సంభవించబోతోంది. దాదాపు 800 సంవత్సరాల తర్వాత మన సౌరకుటుంబంలోని శని, బృహస్పతి గ్రహాలు పక్కపక్కనే కనిపించబోతున్నాయి. సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో నైరుతి వైపు ఈ గ్రహాలు కనిపిస్తాయి. ఇలా రెండు గ్రహాలు చలికాలంలో ఓ చోట చేరితే దాన్ని ‘క్రిస్మస్ స్టార్’ అని పిలుస్తారు. ప్రస్తుతం దీనికి నాసా శాస్త్రవేత్తలు ‘క్రిస్మస్ స్టార్ ఆఫ్ 2020’ అని పేరు పెట్టారు.
ఇలాంటి ఘటనను మళ్లీ చూడాలంటే మరో 60 సంవత్సరాలు ఆగాలని, 2080లో మళ్లీ కనిపిస్తుందని అంతరిక్ష శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గెలీలియో టెలిస్కోప్ కనుగొన్న 13 సంవత్సరాల తర్వాత, 1623లో జూపిటర్ చుట్టూ నాలుగు నక్షత్రాలను గుర్తించారు. వాటిని అప్పట్లో జూపిటర్ చందమామలుగానూ, శాటర్న్ వృత్తంగానూ గుర్తించారు. నాసా పేర్కొంది. ఇలాంటి ఓ ఘటన జరగడం గత 400 ఏళ్లలో ఇదే మొదటి సారి అని తెలిపారు. డిసెంబర్ 21కి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ రోజున ఉత్తరార్థగోళంలో పగలు అత్యంత తక్కువగానూ, దక్షిణార్థగోళంలో పగలు అత్యంత ఎక్కువ సమయం పాటు ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment