
ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వార్షిక సమావేశాల్లో పాల్గొనడానికిగాను ఆరు రోజుల అమెరికా పర్యటనకు వచ్చిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇందులో భాగంగా రెండో రోజు వాషింగ్టన్ డీసీలో వివిధ దేశాల ప్రతినిధులు ఆర్థికమంత్రులతో సమావేశమయ్యారు. భారత్‌దేశం పురోభివృద్ధి, పెట్టుబడులకు అవకాశాల వంటి అంశాలపై వారిపై చర్చలు జరిపారు. అప్పటి ఫొటోలను పక్కన తిలకించవచ్చు. తొలిరోజు పర్యటనలో భాగంగా బుధవారం అమెరికా ఆర్థికమంత్రి జనెత్ యెల్లెన్ నేతృత్వంలోని బృందంతో చర్చలు జరిపిన సీతారామన్, ప్రతిష్టాత్మక బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆర్థికవేత్తలు, వ్యాపారవేత్తలను ఉద్దేశించి కూడా ప్రసంగించిన సంగతి తెలిసిందే.
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్రెసిడెంట్ రాజ కుమార్‌తో భేటీ
ఉప ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి సిగ్రిడ్ కాగ్‌తో సమాలోచనలు
జపాన్ ఆర్థికమంత్రి షుజుకితో
భూటాన్ ఆర్థిక మంత్రి లియోన్‌పో నామ్‌గే షెరింగ్‌తో చర్చలు
Comments
Please login to add a commentAdd a comment