వాషింగ్టన్: సెప్టెంబర్ నెలలో జరగనున్న జీ-20 సదస్సులో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి సంబంధించిన చర్చే ప్రధానం కానుందని చెబుతున్నాయి వైట్ హౌస్ వర్గాలు. ఈ మేరకు అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఒక ప్రకటన చేశారు.
ఈ దఫా జీ-20 సదస్సు భారత్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ ప్రథమార్ధంలో న్యూఢిల్లీ వేదికగా అజరిగే ఈ సదస్సుకు అతిరధ మహారధులంతా హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా పాల్గొనబోయే ఈ సమావేశంలో మిగతా అంశాలతో పాటు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన చర్చ కూడా జరగనుందని సమావేశానికి హాజరుకానున్న అన్ని దేశాలు ఇదే అంశానికి పెద్ద పీట వేసినా ఆశ్చర్యపోనక్కరలేదని అన్నారు అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్.
నాటో సభ్యత్వం కోసం ఉక్రెయిన్ ప్రయత్నం చేయడంతో యుద్ధానికి బీజం పడింది. 2022, ఫిబ్రవరి 24న రష్యా స్పెషల్ మిలటరీ ఆపరేషన్ ప్రారంభించింది. డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మొదలైన యుద్ధం ఏడాదిన్నరగా కొనసాగుతూనే ఉంది. ఇక ఉక్రెయిన్ నాటో సభ్యత్వంపై ఇటీవల జరిగిన సమావేశాల్లో భాగస్వామి దేశాలు సంయుక్తంగా ఒక నిర్ణయానికి వచ్చాయి. రష్యాతో జరుగుతున్న యుద్ధం సమసిపోతే గానీ ఉక్రెయిన్ సభ్యత్వం గురించి ఎటూ తేల్చలేమని తేల్చేశాయి.
ఇటీవల సౌదీ రాజు అధ్యక్షతన ఆ దేశంలో జరిగిన సమావేశంలోనూ ప్రధానంగా ఉక్రెయిన్ గురించిన చర్చ జరిగింది. వచ్చే నెల జీ-20 సదస్సులో కూడా అదే హాట్ టాపిక్ కానుంది. ఎక్కడ సమావేశాలు జరిగినా రష్యా ఉక్రేయి యుద్ధం ప్రస్తావన వస్తూనే ఉంది. సుదీర్ఘన్గా కొనసాగుతున్న యుద్ధం తదనంతర పరిణామాల దృష్ట్యా ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఎలాగైనా యుద్ధాన్ని ఓ కొలిక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తుండడం మంచి పరిణామమే.
ఇది కూడా చదవండి: 24 ఏళ్లయ్యింది.. ఇకనైనా తొలగించండి ప్లీజ్.. మళ్లీ
Comments
Please login to add a commentAdd a comment