మరో ఆయుధం సిద్ధం: కరోనాను కట్టడి చేస్తున్న కొత్త మందు | Merck to Seek EAU for Experimental Covid-19 Drug Molnupiravir | Sakshi
Sakshi News home page

Good News: కరోనాను కట్టడి చేస్తున్న కొత్త మందు

Published Sat, Oct 2 2021 7:58 AM | Last Updated on Sat, Oct 2 2021 2:04 PM

Merck to Seek EAU for Experimental Covid-19 Drug Molnupiravir - Sakshi

వాషింగ్టన్‌: కరోనాపై చేస్తున్న యుద్ధానికి మాత్ర రూపంలో మరో ఆయుధం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మెర్క్‌ రూపొందించిన మందు మాల్నుపిరవిర్‌ కోవిడ్‌పై పోరులో ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు క్లినికల్‌ ట్రయల్స్‌లో తేలింది. మొత్తం 775 మంది వాలంటీర్లపై ఈ మందుతో ప్రయోగాలు జరిపారు.

కోవిడ్‌ సోకి అయిదు రోజులు గడిచిన రోగులకు ఈ మందును ఇచ్చి చూశారు. ఇతరులతో పోలిస్తే ఈ మందు తీసుకున్నవారు త్వరగా కోలుకోవడం, ఆస్పత్రికి రావాల్సిన అవసరం లేకపోవడం, మరణాలు తక్కువగా నమోదవడం వంటి ఫలితాలు వచ్చాయన్నారు. అత్యవసర అనుమతుల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.  

చదవండి: (కేన్సర్‌ కోరలు చాస్తోంది!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement