మేజర్ లీగ్ క్రికెట్-2024లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ లీగ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ ఫ్రాంచైజీకి హెడ్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లీగ్‌లో భాగంగా శనివారం ఉదయం టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో హెడ్ విధ్వంసం సృష్టించాడు.
సూపర్ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. తొలి ఓవర్ నుంచే సూపర్ కింగ్స్ బౌలర్లపై హెడ్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో హెడ్ కేవలం 20 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ ఏడాది మేజర్ లీగ్ క్రికెట్ సీజన్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా హెడ్ నిలిచాడు.
ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 22 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ 5 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వాషింగ్టన్ బ్యాటర్లలో హెడ్‌తో పాటు కెప్టెన్ స్టీవ్ స్మిత్(57), ఓబుస్ పియెనార్(33) పరుగులతో రాణించారు.
అసలేంటి ఈ మేజర్ లీగ్ క్రికెట్?
తమ దేశంలో క్రికెట్‌ను అభివృద్ది చేసేందుకు అమెరికా క్రికెట్ ఆసోయేషిన్ ఈ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీని ప్రారంభించింది. తొట్ట తొలి సీజన్ గతేడాది జూలై 13 నుంచి 30 వరకు జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న సీజన్ రెండో సీజన్. మొత్తం ఈ క్రికెట్ లీగ్‌లో ఆరు జట్లు పాల్గోంటున్నాయి.
ఇందులో సీటెల్ ఓర్కాస్, ఎంఐ న్యూయర్క్ లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్, టెక్సాస్ సూపర్ కింగ్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్, శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఇందులో ఎంఐ న్యూయర్క్, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్, టెక్సాస్ సూపర్ కింగ్స్ ఫ్రాంజైలు ఐపీఎల్ యాజమాన్యంకు సంబంధించినవే గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment