
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో స్టీవ్ స్మిత్ మెరుపులు కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఎడిషన్‌లో శైలికి భిన్నంగా రెచ్చిపోయి ఆడుతున్న స్మిత్.. తాజాగా మరో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 23 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 31 బంతులు ఎదుర్కొన్న స్మిత్.. 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. ప్రస్తుత ఎడిషన్‌లో స్మిత్‌కి ఇది వరసగా రెండో హాఫ్ సెంచరీ.
Steven Smith on fire in the MLC. 😲🔥pic.twitter.com/rMFbQPRpM1
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 23, 2024
మరో ఎండ్‌లో ట్రవిస్ హెడ్ సైతం మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోతున్నాడు. వాషింగ్టన్ ఫ్రీడంకు ఓపెనర్లుగా వస్తున్న ఈ ఇద్దరు ఆకాశమే హద్దుగా ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. యూనికార్న్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హెడ్ కూడా మెరుపు హాఫ్ సెంచరీతో అలరించాడు. 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 56 పరుగుల చేసి ఔటయ్యాడు. ఈ సీజన్‌లో హెడ్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడం.. 15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో వాషింగ్టన్ ఇన్నింగ్స్‌ను అక్కడే ముగించారు. ఈ మ్యాచ్ 14 ఓవర్లకు కుదించి యూనికార్న్స్ లక్ష్యాన్ని 177 పరుగులుగా నిర్దారించారు.
ఈ ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్ బెర్తులు ఇదివరకే ఖరారు కావడంతో ఈ మ్యాచ్‌కు అంత ప్రాధాన్యత లేదు. వాషింగ్టన్, యూనికార్న్స్ తొలి రెండు ప్లే ఆఫ్స్ బెర్త్‌లను ఖరారు చేసుకోగా.. టెక్సాస్ సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ ఎడిషన్‌లో వాషింగ్టన్ జట్టు ఇంత వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడలేదు.