మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో స్టీవ్ స్మిత్ నేతృత్వలోని వాషింగ్టన్ ఫ్రీడం తొలి ఓటమి చవి చూసింది. శాన్‌ఫ్రాన్సిస్కోతో ఇవాళ (జులై 23) జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతి) పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ 15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన యూనికార్న్స్‌కు టార్గెట్ నిర్దేశించారు.
యూనికార్న్స్ టార్గెట్ 14 ఓవర్లలో 177 పరుగులుగా నిర్దారించబడింది. భారీ లక్ష్య ఛేదనలో ఆది నుంచే దూకుడుగా ఆడిన యూనికార్న్స్.. మరో రెండు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. జోస్ ఇంగ్లిస్ (17 బంతుల్లో 45; ఫోర్, 6 సిక్సర్లు), సంజయ్ కృష్ణమూర్తి (42 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), హసన్ ఖాన్ (11 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సిక్సర్ల వర్షం కురిపించి తమ జట్టును గెలిపించారు.
వాషింగ్టన్ బౌలర్లలో ఆండ్రూ టై 3 వికెట్లు పడగొట్టగా.. అకీల్ హొసేన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అంతకుముందు ట్రవిస్ హెడ్ (36 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (31 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో వాషింగ్టన్ భారీ స్కోర్ చేసింది. ఆండ్రియస్ గౌస్ (29 నాటౌట్), రచిన్ రవీంద్ర (16) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆండర్సన్‌కు రెండు వికెట్లు దక్కాయి.
కాగా, ప్లే ఆఫ్స్ బెర్తులు ఇదివరకే ఖరారు కావడంతో వాషింగ్టన్, యూనికార్న్స్ మ్యాచ్‌కు అంత ప్రాధాన్యత లేదు. పాయింట్ల పట్టికలో వాషింగ్టన్, యూనికార్న్స్ తొలి రెండు ప్లే ఆఫ్స్ బెర్త్‌లను ఖరారు చేసుకోగా.. టెక్సాస్ సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment