వాషింగ్టన్: ఎలాన్ మస్క్ పరిచయం అక్కరలేని పేరు. 58 మిలియన్ల నెటిజన్‌లు ఆయనకు సోషల్ మీడియాలో ఫాలోవర్లుగా ఉన్నారు. కాగా మంగళవారం మస్క్ అభిమాన క్లబ్ ట్విట్టర్ హ్యాండిల్ - ఈస్ట్ బే జనాభా పెరుగుదల తగ్గవచ్చంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రపంచ జనాభా పడిపోతోంది. ఎలాన్ మస్క్ ఈ ఉపద్రవం నుంచి ప్రపంచాన్ని కాపాడాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఇక ఎలాన్ మస్క్ ఏడుగురు పిల్లల తండ్రి అనే సంగతి తెలిసందే. అంగారక గ్రహంపై ప్రస్తుతం జనాభా సున్నా. అందువల్ల అక్కడ జనాభా అవసరం. స్పేస్‌ఎక్స్ అధినేతకు భూమికి పొరుగు ఉన్న గ్రహంలో మనుషులు ఆవాసం ఏర్పాటు చేసుకోవాలనే జీవితకాల కల ఉందని పేర్కొన్నారు. "మానవులు భూమిపై ఇతర జీవుల సంరక్షకులు. అలాగే మార్స్‌కు ప్రాణం పోద్దాం!" అంటూ ట్వీట్ చేశారు.
దీనిపై మస్క్ స్పందిస్తూ.. ‘‘జనాభా పతనం అనేది ప్రజలు గ్రహించిన దానికంటే చాలా పెద్ద సమస్య, అది భూమికి మాత్రమే" అంటూ కామెంట్ చేశారు. ఇక ఓ నెటిజన్ స్పందిస్తూ.. తనకు ఆడ పిల్ల పుట్టాలని ఆశిస్తున్నానని అన్నాడు. మస్క్ కూడా అదే కోరుకుంటున్నట్లు తెలిపారు. తన తదుపరి సంతానంగా అమ్మాయి పుడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఎలాన్ మస్క్‌కు ఎనిమిది మంది సంతానం.
వారు బేబీ ఎక్స్(1) జేవియర్ (17), గ్రిఫిన్ (17), డామియన్ (15), సాక్సన్ (15), కై (15) నెవాడా అలెగ్జాండర్. కాగా మస్క్ అతని మొదటి భార్య జెన్నిఫర్ జస్టిన్ విల్సన్‌కు ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే మొదటి జన్మించిన నెవాడా అలెగ్జాండర్ 2002లో పుట్టిన 10 వ వారంలో మరణించాడు. 2050, 2100 నాటికి ప్రపంచ సంతానోత్పత్తి రేటు తగ్గే అవకాశం ఉందని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ 2020 పేర్కొంది. ప్రపంచ సంతానోత్పత్తి రేటు 2017 లో దాదాపు 2.4 కి సగానికి పడిపోయింది. 2100 నాటికి 1.7 కి తగ్గుతుందని పేర్కొంది.
Population collapse could be upon us, but we appreciate that you good sir are still making tangible efforts to stave it off. @elonmusk 👶🏻💚🌎 pic.twitter.com/qlwz1JBUhj
— Tesla Owners of the East Bay (@TeslaOwnersEBay) July 14, 2021
Me too!
— Elon Musk (@elonmusk) July 14, 2021
Comments
Please login to add a commentAdd a comment