న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ డ్రెస్ జిగేల్మంది. నలుపు రంగు డ్రెస్‌పై తెల్ల గీతలు.. వాటిపై నీలి రంగు పూల డిజైన్‌తో మిషెల్ మెరిసిపోయారు! మోకాళ్ల వరకున్న ఈ డ్రెస్‌పై మ్యాచింగ్ కోటు ధరించారు. ఈ దుస్తులను న్యూయార్క్‌లోని భారతీయ డిజైనర్ బిహు మహాపాత్ర రూపొందించారు. ఒడిషాలోని రూర్కెలాకు చెందిన బిహు అమెరికాలో ప్రఖ్యాత డిజైనర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన బెనారస్‌లో ఓ ప్రత్యేకమైన పట్టుచీర మిషెల్ కోసం రూపొందించారు. పూర్తిగా చేతితో నేసిన ఈ చీరలో సన్నని బంగారు, వెండి పోగులు వాడారు. 400 గ్రాములు ఉండే ఈ చీర ఖరీదు లక్షా 50 వేల రూపాయలు. బెనారస్‌కు చెందిన ముగ్గురు నిపుణులు దీన్ని మూడు నెలలు కష్టపడి తయారు చేశారు. శనివారమే దీన్ని దేశ రాజధానికి తీసుకువచ్చారు.
మెరిసిపోయిన మిషేల్ డ్రెస్!
Published Mon, Jan 26 2015 3:50 AM | Last Updated on Sat, Sep 2 2017 8:15 PM
Advertisement
Advertisement