వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. 2024 అధ్యక్ష ఎన్నికల కోసం డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలు ఫోకస్ పెట్టాయి. దీంతో, రెండు పార్టీలు హోరాహోరీగా తలపడనున్నాయి. అయితే, అధికార డెమోక్రటిక్ పార్టీలో ఆసక్తికర పరిమాణం చోటుచేసుంది. డెమోక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ బదులుగా.. మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్లీ ఒబామా బరిలో నిలవాలని అమెరికన్లు కోరుకుంటున్నారని రాస్‌ముస్సెన్ రిపోర్ట్స్ పోల్ పేర్కొంది.
వివరాల ప్రకారం.. 2024లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ మరో దఫా ఎన్నికల్లో నిలబడేందుకు అమెరికన్లు ఇష్టపడటం లేదు. ఆయన వయసు, మానసిక ఆరోగ్య స్థితిని ఇందుకు కారణంగా చూపుతున్నారు. అలా చెబుతున్నవారు దాదాపు 48 శాతం ఉన్నారని తేలింది. బైడెన్ బదులు.. మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్లీ ఒబామాను కోరుకుంటున్నారని రాస్‌ముస్సెన్ రిపోర్ట్స్ పోల్ పేర్కొంది. కాగా, 38 శాతం మంది జో బైడెన్‌ను కోరుకోవడం లేదని ఈ మేరకు న్యూయార్క్ పోస్ట్ ఒక వార్తను ప్రచురించింది.
If Michelle Obama decides to replace President Biden ,then it's an absolute game over for Trump or Republicans .
— Prashant shah (@prashantsapp) February 28, 2024
She will win presidency hands down, and for us, staunch Gandhian will be the most powerful person on the face of earth.
Let the game begin @MichelleObama pic.twitter.com/pFkyFrYO67
ఇక, అదే సమయంలో బైడెన్‌ను మార్చే అవకాశాలు లేవని 45 శాతం మంది అభిప్రాయపడుతున్నారని సర్వేలో వెల్లడైంది. బైడెన్ మరోసారి ఎన్నికకు సిద్ధపడకపోతే ఆయన స్థానంలో ఎవరైతే బాగుంటందనే ప్రశ్నతో సర్వే నిర్వహించారు. ఇందులో మిషెల్లీ ఒబాబాకే ఎక్కువ సంఖ్యలో మద్దతు పలికారు. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ తదితరులు తదుపరి స్థానాల్లో ఉన్నారు.
ఇదిలా ఉండగా.. మిషెల్లీ ఒబామా మాత్రం తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తితోలేనని ఇప్పటికే ప్రకటించారు. కాగా, జనవరిలో ఒక పాడ్‌క్యాస్ట్ ఇంటర్వ్యూలో మిషెల్లీ ఒబామా మాట్లాడుతూ 2024 అధ్యక్ష ఎన్నికల్లో వచ్చే ఫలితం గురించి తాను భయపడుతున్నానని వ్యాఖ్యానించారు. అలాగే, తనకు ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment