మిచెల్ నృత్యానికి అరుదైన గౌరవం
న్యూయార్క్ : అమెరికా ప్రథమ మహిళ మిచెల్ ఒబామా బాలీవుడ్ నృత్యానికి అరుదైన గౌరవం దక్కింది. వైట్హౌజ్కు సంబంధించిన టాప్-10 ఫోటోలలో మిచెల్ చేసిన బాలీవుడ్ నృత్యానికి చోటు దక్కింది. గత ఏడాది దీపావళి పండుగను పురస్కరించుకుని వైట్హౌజ్ లోని స్టేట్ డైనింగ్ రూంలో మిచెల్ బాలీవుడ్ పాటలకు నృత్యం చేసిన విషయం తెలిసిందే.
మూడేళ్ళక్రితం ఇండియాకు వచ్చినప్పుడు ముంబైలో బాలీవుడ్ గీతాలతో పరవశించి డ్యాన్స్ చేసిన మిచెల్ ఈసారి కూడా దీపావళి వేడుకల్లో వినిపించిన బాలీవుడ్ సంగీతానికి పరవశించిపోయి నృత్యం చేశారు. కాగా మిచెల్కు మొదటి నుంచి సంగీతం అంటే ఎంతో ఇష్టం...అది అమెరికాదా లేదా భారతీయ సంగీతమా అని కాదు... ఏదైనా సరే కాలు కదపాల్సిందే. మంద్రంగా సాగే సంగీతానికి నాట్యం చేయడమంటే మిచెల్‌కి ఇష్టం.