Michelle
-
సింధు ఐదో‘సారీ’
కుమమోటో: పారిస్ ఒలింపిక్స్ తర్వాత పాల్గొన్న మూడో టోర్నమెంట్లోనూ భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. జపాన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ 20వ ర్యాంకర్ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. ప్రపంచ 23వ ర్యాంకర్, చైనా సంతతికి చెందిన కెనడా ప్లేయర్ మిచెల్లి లీతో జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–17, 16–21, 17–21తో పోరాడి ఓడిపోయింది. మిచెల్లి లీ చేతిలో సింధుకిది ఐదో పరాజయం కావడం గమనార్హం. మిచెల్లిపై 10 సార్లు నెగ్గిన సింధుకు ఈసారి మాత్రం నిరాశ తప్పలేదు. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నా... ఆ తర్వాతి రెండు గేముల్లో కీలకదశలో తడబడి మూల్యం చెల్లించుకుంది. 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో రెండుసార్లు (మిక్స్డ్ టీమ్ మ్యాచ్, సింగిల్స్ సెమీఫైనల్) సింధును ఓడించిన మిచెల్లి ఆ తర్వాత 2023లో థాయ్‌లాండ్ ఓపెన్‌లో మూడోసారి సింధుపై నెగ్గింది. ఈ ఏడాది ఆర్క్టిక్ ఓపెన్‌లో నాలుగోసారి సింధును ఓడించిన మిచెల్లి నెల తిరిగేలోపు జపాన్ ఓపెన్‌లో మరోసారి గెలుపు రుచి చూసింది. -
జరిగింది చాలు, మానవ హక్కులను కాపాడండి : యూఎన్‌లో మౌన నిరసన
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ముగింపు సమావేశం సందర్భంగా కొంతమంది మానవ హక్కుల ప్రతినిధులు మౌనంగా నిరసన తెలిపారు. జెనీవాలో జరిగిన రెండు రోజుల ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమీక్ష ముగింపులో భాగంగా రాయబారి మిచెల్ టేలర్ ప్రసంగం సందర్భంగా సామాజిక, జాతి, న్యాయ ఉద్యమకారులు పలువురు ఈ నిరసన వ్యక్తం చేశారు. మిచెల్ మాట్లాడుతున్న సమయంలో గాజాలో ఇజ్రాయెల్ చర్యలను సమర్ధిస్తున్న ఆమెరికాకు వ్యతిరేకంగా మానవ హక్కులను, గౌరవాన్ని కాపాడండి అంటూ ప్రతినిధులు మౌనంగా లేచి నిలబడి, వెనక్కి తిరిగి నిల్చున్నారు. ముందుగా డిగ్నిటీ డెలిగేషన్ సభ్యులు ఈ మౌన నిరసనకు దిగారు. అమెరికా న్యాయ వ్యవస్థ, చట్టాలు, విధానాలపై, వైఖరికి పట్ల తాము చాలా నిరాశకు గురయ్యామని అలయన్స్ శాన్ డియాగో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆండ్రియా గెర్రెరో అన్నారు. గ్వామ్, ప్యూర్టో రికో, హవాయి తదితర ప్రాంతాల ప్రతినిధులుఇందులో ఉన్నారు. జెనీవాలోని యుఎన్లోని యుఎస్ రాయబారి మిచెల్ టేలర్ బుధవారం యుఎన్ మానవ హక్కుల కమిటీ సమావేశమైంది. ఈ కమిటీ సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలు, సిఫార్సులను వచ్చే నెల (నవంబర్ 3న) విడుదల చేయనుంది. కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడితో సమావేశమయ్యారు. అలాగే బైడెన్ సలహామేరకు రఫా సరిహద్దు గుండా గాజా ప్రజలకు ఆహార పదార్థాలు, మందులు అనుమతించడానికి ఎట్టకేలకు ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకుంది. యుద్ధం నేపథ్యంలో తర్వాత చేపట్టాల్సిన చర్యలపైనా చర్చించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇది ఇలా ఉంటే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) కూడా ఇజ్రాయెల్ చేరుకున్నారు. కష్టాల్లో ఉన్న దేశానికి మద్దతుగా ఉంటాం.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము ఎపుడూ నిలబడతామంటూ గురువారం ట్వీట్ చేశారు. రిషీ కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌తో సమావేశంకానున్నారు. At the UN Human Rights Committee, many delegates turned their backs on US Ambassador Michelle Taylor in silent protest against the American backing of Israel's war-crimes in Gaza. Huge. The world is slowly waking up to their lies and deceit. #Gaza pic.twitter.com/YIEHKY114D — Advaid അദ്വൈത് (@Advaidism) October 19, 2023 I am in Israel, a nation in grief. I grieve with you and stand with you against the evil that is terrorism. Today, and always. סוֹלִידָרִיוּת pic.twitter.com/DTcvkkLqdT — Rishi Sunak (@RishiSunak) October 19, 2023 -
ఎవరీ మైకేల్?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: అగస్టా కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మధ్యవర్తి, బ్రిటిషర్ క్రిస్టియన్ మైకేల్‌ను ఢిల్లీలోని ఓ కోర్టు ఐదు రోజుల పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కస్టడీకి అప్పగించింది. భారత్‌లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రక్షణ మంత్రి సహా పలువురు వీవీఐపీల కోసం రూ.3,600 కోట్లతో 12 విలాసవంతమైన హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో మైకేల్‌ను సీబీఐ అధికారులు నిన్న రాత్రి యూఏఈ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన్ను గట్టి భద్రత నడుమ ఢిల్లీలోని కోర్టు ముందు సీబీఐ అధికారులు హాజరుపర్చారు. అగస్టా కుంభకోణంలో లోతైన కుట్ర దాగుందనీ, ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల పాత్రపై దర్యాప్తు జరపడానికి వీలుగా 14 రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ న్యాయవాది డీపీ సింగ్ కోరారు. దీంతో సీబీఐ ప్రత్యేక జడ్జి.. మైకేల్‌ను 5 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించారు. అగస్టా ఒప్పందంలో భాగంగా మైకేల్ రూ.225 కోట్లు అందుకున్నారనీ, ఈ మొత్తాన్ని ప్రభుత్వ పెద్దలు, ఐఏఎఫ్ అధికారులకు లంచంగా చెల్లించారని సీబీఐ చార్జిషీటులో తెలిపింది. అలాగే మైకేల్ కంపెనీ గ్లోబల్ సర్వీసెస్ ద్వారా ఢిల్లీలోని ఓ మీడియా సంస్థలోకి నగదు వచ్చిన విషయాన్ని తాము గుర్తించినట్లు ఈడీ వెల్లడించింది. మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటలయుద్ధం ముదిరింది. మైకేల్‌పై తప్పుడు వాంగ్మూలం ఇప్పించి ప్రతిపక్ష నేతలపై బురద చల్లేందుకు బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అగస్టా కుంభకోణంలో మధ్యవర్తిగా ఉన్న మైకేల్‌ను కాపాడాలనుకుంటోందా? అని బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఇబ్బంది తప్పదా! మైకేల్‌ను విచారించడం ద్వారా అగస్టా కుంభకోణంలో కాంగ్రెస్ నేతల పాత్రపై మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయనీ, తద్వారా కాంగ్రెస్‌ను రాజకీయంగా ఇరుకునపెట్టాలని కేంద్రం భావిస్తోంది. విజయ్ మాల్యా, నీరవ్‌మోదీ వంటి ఆర్థిక నేరస్తులను వెనక్కి రప్పించడంలో బీజేపీ సర్కారు విఫలమయిందంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టేందుకు మైకేల్‌ను బీజేపీ ఆయుధంగా ఉపయోగించుకుంటుందని పరిశీలకులు అంటున్నారు. ఈ ఒప్పందం కుదరాలంటే సోనియాగాంధీని ప్రసన్నం చేసుకోవాలంటూ 2008లో అప్పటి అగస్టా కంపెనీ భారత్ విభాగం చీఫ్ పీటర్ హ్యూలెట్‌కు రాసిన లేఖలో మైకేల్ సూచించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీ అధికారులు ఇప్పటికే మైకేల్ డైరీని సంపాదించారు. అగస్టా ఒప్పందం కోసం ఎవరెవరికి ఎంత ముడుపులు ఇచ్చింది మైకేల్ తన డైరీలో కోడ్ భాషలో రాసుకున్నారు. కాగా, అగస్టా కుంభకోణానికి సోనియాకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. కేంద్రం ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు ఒత్తిడి చేసి మైకేల్ చేత బలవంతపు వాంగ్మూలం ఇప్పించారని ఆరోపించింది. సల్వార్కమీజ్లో పారిపోయేందుకు యత్నం! భారత అధికారులకు దొరక్కుండా ఉండేందుకు మైకేల్ చాలా వ్యూహాలు రచించాడు. తొలుత దుబయ్ పోలీసులు తనను అరెస్ట్ చేయగానే తాను బ్రిటన్ పౌరుడ్ని అయినందున భారత్‌కు అప్పగించడం కుదరదని వాదించారు. వెంటనే అప్రమత్తమైన జాతీయభద్రతా సలహాదారు అజిత్ దోవల్ మైకేల్ చేజారిపోకుండా ఏడాది క్రితం సీబీఐ, నిఘా సంస్థ ‘రా’ అధికారులతో ఓ బృందాన్ని ఏర్పాటుచేశారు. సెప్టెంబర్‌లో దుబయ్‌లోని కోర్టు ఆయనకు ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేసింది. దీంతో సల్వార్ కమీజ్, టోపీ ధరించి మారువేషంలో పారిపోయేందుకు మైకేల్ యత్నించగా భారత నిఘావర్గాలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అయన్ను పట్టుకున్నారు. దౌత్యమార్గంలోనూ ఒత్తిడి పెంచడంతో యూఏఈ మైకేల్‌ను భారత్‌కు అప్పగించింది. ఎవరీ మైకేల్? బ్రిటన్ పౌరుడైన మైకేల్ వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. భారత్ నుంచి అగస్టాకు కాంట్రాక్టులు సాధించిపెట్టడమే మైకేల్ పని. మైకేల్ తండ్రి వోల్ఫ్‌గంగ్ మైకేల్ సైతం 1980లలో వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి ఇండియాలో కన్సల్టెంట్‌గా చేశారు. ఆయన మూడు కంపెనీలు నిర్వహించారు. తరచూ భారత్‌లో పర్యటించే మైకేల్‌కు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో స్నేహం ఏర్పడింది. పరిచయాలను స్వదినియోగం చేసుకున్న ఆయన భారత్ నుంచి 12 హెలికాప్టర్ల కాంట్రాక్టును అగస్టా కంపెనీకి ఇప్పించేందుకు రంగంలోకి దిగారు. ఇందుకోసం రాజకీయ నేతలకు, ఐఏఎఫ్ అధికారులకు భారీగా లంచాలిచ్చారు. దీంతో అప్పటివరకూ హెలికాప్టర్ ప్రయాణించే ఎత్తు పరిమితిని అధికారుల సాయంతో 6,000 మీటర్ల నుంచి 4,500కు తగ్గించగలిగారు. దీంతో అప్పటివరకూ రేసులోనే లేని అగస్టా ఏకంగా కాంట్రాక్టునే ఎగరేసుకుపోయింది. భారత రక్షణ, వైమానిక దళాలకు చెందిన రహస్య పత్రాలు, సమాచారాన్ని సంపాదించిన మైకేల్ ముంబైలోని తన సహాయకుడి ద్వారా దాన్ని వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి చేరవేయగలిగాడు. వీవీఐపీ హెలికాప్టర్ కొనుగోలు ప్రక్రియ మొదలయ్యాక 1997–2013 మధ్యకాలంలో మైకేల్ 300 సార్లు ఇండియాకు వచ్చాడు. -
ఒబామా పొగడ్తలన్నీ బిల్డప్పేనా?
ఎప్పుడూ పిల్లలతో కలిసి ముచ్చటగా కనిపించే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు త్వరలో విడిపోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతర్జాతీయ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో తెలియదుగానీ, వారు విడిపోబోతున్నారన్న వార్త వినడానికే బాధగా ఉంటుంది. ఒబామా, మిషెల్లది 22 ఏళ్ల కాపురం - ఇద్దరు పిల్లలు. ఒబామా మాట్లాడిన ప్రతిసారీ భార్యా - పిల్లలు- కుటుంబం గురించి ఎక్కువగా మాట్లాడేవారు. ముఖ్యంగా భార్య గుణగణాల గురించి తెగ పొగిడేస్తుంటారు. ఇప్పుడు ఇదంతా కేవలం బిల్డప్కేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే 50వ పుట్టిన రోజు జరుపుకున్న అమెరికా ప్రథమ మహిళ మిషెల్ కూడా అంతే మాట్లాడేవారు. వారిది ఎంతో అన్యోన్య దాంపత్యం అని అందరూ అనుకుంటున్నారు. బరాక్ ఒబామా, మిషెల్ దంపతులు విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కొన్నిరోజులుగా పలు అంతర్జాతీయ పత్రికలు, టీవీలు, వెబ్సైట్లు కోడై కూస్తున్నాయి. మిషెల్ - ఒబామా మధ్య మనస్పర్థలు వచ్చాయి - భర్తతో మిషెల్ అనధికారికంగా తెగదెంపులు చేసుకున్నారు - వేరువేరు బెడ్రూమ్లలో పడుకుంటున్నారు - వారిద్దరూ 2016లో విడిపోతారని.... ఇలా ఒక్కటేంటీ ఎన్నో రకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఎన్నెన్నో పుకార్లు. అయితే విడాకులు మాత్రం ఇప్పుడు తీసుకోరని వార్తలు వస్తున్నాయి. ఒబామా పదవీకాలం ముగిసేవరకూ మిషెల్ ‘వైట్‌హౌస్’లోనే ఉంటారు. ఇంతకీ మిషెల్‌కు ఒళ్లెందుకు మండింది? దానికి చాలా కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. వాటిలో ప్రధానమైనది ఒబామాకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు మిషెల్‌కు అనుమానం. ఒబామా అధ్యక్షుడుగా పోటీ చేసే సమయంలో ప్రచారం కోసం తెగ కష్టపడిన ప్రచారకర్త 'వెరా బేకర్'తో అతనికి అఫైర్ ఉన్నట్లు మిషెల్ నమ్ముతున్నట్లు మీడియా ప్రచారం. నల్లజాతి సూర్యుడు నెల్సన్ మండేలా అంత్యక్రియల సమయంలో ఈ జంట మధ్య రేగిన వివాదం మీడియాకెక్కింది. ఆమె పక్కనే కూర్చున్నా ఒబామా పట్టించుకో కుండా, డెన్మార్క్ ప్రధాని ధోర్నింగ్ ష్మిత్తో కబుర్లు చెప్పుకున్నారట. అంతేకాకుండా ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చారట. దాంతో మిషెల్‌కు కడుపు మండిపోయింది. పట్టలేని కోపం వచ్చిందట. హావాయిలో క్రిస్మస్ హాలీడేస్ సమయంలో ఇంట్లో మిషెల్ లేనప్పుడు ఒబామా ఓ మహిళా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌తో కనిపించారని సమాచారం. విడాకుల విషయమై ఇప్పటికే మిషెల్ లాయర్‌ను సంప్రదించినట్లు సమాచారం. భర్త ఆస్తుల్లో సగభాగం పొందేందుకు ఏమేం చేయాలో కూడా ఆమె ఆరాలు తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రెసిడెంట్‌గా ఒబామా గద్దె దిగిన తరువాత అతనితో ఎక్కడికీ వెళ్లకుండా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. తాను మాత్రం పిల్లలతో పాటు వాషింగ్టన్ డిసిలో ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. ఒబామా తన సొంతూరైన హవాయిలో శేష జీవితం గడపాలనుకుంటున్నారని తెలుస్తోంది. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా ఇలాంటి భామకలాపంలో చిక్కుకుని పేరు పొగొట్టుకున్నారు. ఇప్పుడు ఒబామా కూడా అదే స్థితిలో ఉన్నారని అమెరికాలో తెగ గుసగుసలు వినవస్తున్నాయి. ఇంత ప్రచారం జరుగుతున్న వైట్‌హౌస్ మాత్రం స్పందించడంలేదు. వాషింగ్టన్‌లోని మీడియా హౌజ్‌లు ఈ పుకార్లను లైట్‌గా తీసుకుంటున్నాయి. నిప్పు లేందే పొగరాదుగా అని కొందరంటుంటే, ఆదర్శ దంపతులు తప్పటడుగు వేస్తారని అనుకోవడం లేదని కొందరు గట్టిగా వాదిస్తున్నారు. -
మిచెల్ నృత్యానికి అరుదైన గౌరవం
న్యూయార్క్ : అమెరికా ప్రథమ మహిళ మిచెల్ ఒబామా బాలీవుడ్ నృత్యానికి అరుదైన గౌరవం దక్కింది. వైట్‌హౌజ్‌కు సంబంధించిన టాప్-10 ఫోటోలలో మిచెల్ చేసిన బాలీవుడ్ నృత్యానికి చోటు దక్కింది. గత ఏడాది దీపావళి పండుగను పురస్కరించుకుని వైట్‌హౌజ్ లోని స్టేట్ డైనింగ్ రూంలో మిచెల్ బాలీవుడ్ పాటలకు నృత్యం చేసిన విషయం తెలిసిందే. మూడేళ్ళక్రితం ఇండియాకు వచ్చినప్పుడు ముంబైలో బాలీవుడ్ గీతాలతో పరవశించి డ్యాన్స్ చేసిన మిచెల్ ఈసారి కూడా దీపావళి వేడుకల్లో వినిపించిన బాలీవుడ్ సంగీతానికి పరవశించిపోయి నృత్యం చేశారు. కాగా మిచెల్‌కు మొదటి నుంచి సంగీతం అంటే ఎంతో ఇష్టం...అది అమెరికాదా లేదా భారతీయ సంగీతమా అని కాదు... ఏదైనా సరే కాలు కదపాల్సిందే. మంద్రంగా సాగే సంగీతానికి నాట్యం చేయడమంటే మిచెల్‌కి ఇష్టం. -
మానవత్వం మిషెల్‌గా మారింది!
ముంబై సమీపంలోని కళ్యాణ్‌లో నివసించే మిషెల్ ఖాజీం కామ్లె ఓ సాధారణ విద్యార్థిని. అయితేనేం... ఆమె చూపిన అసాధారణ సాహసం అందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది. ఇంతకీ ఆమె ఎవరు... ఆమె చేసిన సాహసం ఏమిటి? డిసెంబర్ 14, శనివారం... పశ్చిమ కళ్యాణ్‌లోని సంతోషిమాతా రోడ్డుపై, సాయంత్రం ఆరింటప్పుడు రామ్‌బాగ్‌లో నివసించే డాక్టర్ మయూర్ మెహతా అనే వ్యక్తి స్కూటర్ మీద వెళుతూ 19 ఏళ్ల జయేష్ డోంగరే అనే యువకుడిని ఓవర్టేక్ చేశాడు. దాంతో వారి మధ్య మాటా మాటా పెరిగి జయేష్ తన వద్ద ఉన్న కత్తితో మయూర్‌పై దాడి చేశాడు. మయూర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో అక్కడ చాలామంది ఉన్నప్పటికీ, పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుందన్న భయంతో ఒక్కరూ ముందుకు రాలేదు. రక్తపు మడుగులో మృత్యువుతో పోరాడుతున్న మయూర్‌ను ప్రేక్షకుల్లా చూడసాగారు. మిషెల్ రోజూ మాదిరిగానే ఆ రోజు కూడా కాలేజ్ నుంచి ఆ దారిలో ఇంటికి వెళుతోంది, అయితే ఆమె ఈ సంఘటన చూసి చలించిపోయింది. రక్తపుమడుగులో పడి ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లి, అతనికి ధైర్యం చెప్పింది. అక్కడ ప్రేక్షకుల్లా నిలబడి ఉన్నవారిని అతణ్ణి ఆసుపత్రికి తరలించేందుకు సహకరించమని కోరింది. కాని ఎవరూ ముందుకు రాలేదు. మరోవైపు అతని శరీరం నుంచి రక్తస్రావం ఆగడంలేదు. దీంతో తమ సంప్రదాయపు పరదాలను పక్కనబెట్టి, తన ముఖం మీద ఉన్న స్కార్ఫ్ తీసి, కత్తిపోటు కారణంగా రక్తస్రావం అవుతున్న చోట కట్టుకట్టింది. రోడ్డుకు ఒకపక్కగా మయూర్‌ను పడుకోబెట్టి... అటుగా వెళుతున్న ఆటోలను ఆపింది. ఆటోవాళ్లు ఒక్కరూ ముందుకు రాకపోవడంతో ఆసుపత్రికి తీసుకుపోకుంటే కేసు పెడతానని బెదిరించడంతో చివరికి ఓ ఆటోవాలా అంగీకరించాడు. ఆగమేఘాల మీద అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావం జరగడంతో చికిత్స పొందుతూ, కొద్దిసేపటిలోనే కన్నుమూశాడు మయూర్. ఎంత ప్రయత్నించినా సాటిమనిషి ప్రాణాలను కాపాడలేకపోయినందుకు మూగగా రోదించింది మిషెల్. మిషెల్‌తోపాటు చొరవతో ముందుకు వచ్చిన మరో ముగ్గురు అందించిన వివరాల మేరకు నిందితుడిని రెండు రోజుల్లోనే పోలీసులు అరెస్టు చేశారు. అసాధారణ చొరవచూపి సాటి మనిషికి సహాయం చేసిన మిషెల్‌ను ఠాణే పోలీసులు సత్కరించారు. కళ్యాణ్ డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ (కెడిఎంసి) కూడా ఆమెను ప్రతిభను గుర్తించి సత్కరించింది. ఆమెతోబాటు ... ఆమెకు సహకరించిన గులాం హుస్సేన్, అమోల్ జోషిలను కూడా సత్కరించారు. అయితే ఆమె సత్కారాలతో తనకు సంతృప్తి లభించదని, ఇటువంటి సంఘటనలను చూసినప్పుడైనా, ప్రేక్షకపాత్ర వహించకుండా మానవతాదృక్పథంతో స్పందించి, కష్టాలలో ఉన్న వారికి చేతనైన సాయం అందిస్తేనే అసలైన ఆనందం కలుగుతుందంటుంది. ఈ బాధ్యత మనందరిదీ! ‘‘మానవత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ముఖ్యంగా ప్రాణం పోతే తిరిగిరాదన్న సంగతి అందరం గుర్తుంచుకోవాలి. మనవాళ్లు ప్రమాదంలో ఉంటే ఎలా వ్యవహరిస్తామో ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే కాపాడేందుకు కూడా అంత సిన్సియర్‌గా ప్రయత్నించాలి’’అంటున్న మిషెల్ మాటల్లో ఎంతో నిజం ఉంది. - గుండారపు శ్రీనివాస్, ముంబై, సాక్షి ఫొటోలు: పిట్ల రాము గర్వించేలా చేసింది... ‘‘మా అమ్మాయి చేసిన సాహసం, ధైర్యం మా కుటుంబంలోని వారందరినీ గర్వించేలా చేసింది. మొన్నటివరకూ నన్ను ఎవరూ పట్టించుకోని వారు కూడా ఇవ్వాళ్ల నన్ను చూసి ‘అరుగో, ఆయనే మిషెల్ తండ్రి’ అని ఒకరితో ఒకరు చెప్పుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది’’ - ఖాజీం కామ్లె, మిషెల్ తండ్రి సంప్రదాయం కన్న ప్రాణమే మిన్న అనిపించింది సాధారణంగా మా సంప్రదాయం ప్రకారం తలమీద ఉండే వస్త్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించం. అయితే ఆ రోజు నేనున్న పరిస్థితుల్లో అంతకంతకూ తీవ్రమవుతున్న రక్తస్రావాన్ని ఆపాలంటే నా తలమీద ఉండే వస్త్రాన్ని తొలగించడం మినహా మరో మార్గం కనిపించలేదు. సంప్రదాయాన్ని కాపాడుకోవడం కన్నా సాటి మనిషి ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని ఆ క్షణంలో నాకు అనిపించింది. - మిషెల్ -
మా ఆవిడకి భయపడి.. సిగరెట్లు మానేశా: ఒబామా
ప్రపంచాన్ని గడగడలాడించే సామర్థ్యం గల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా... ఇంట్లో వాళ్లావిడ ముందు మాత్రం పిల్లిలాగే ఉంటారు!! ఆమె అంటే భయపడి చివరకు సిగరెట్లు కాల్చడం మానేశారట!! ఈ విషయాన్ని స్వయంగా ఒబామాయే ఐక్యరాజ్యసమితికి చెందిన ఓ అధికారికి చెప్పారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశాల సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి మైనా కై ఆయన పొగతాగే అలవాటు గురించి ప్రశ్నించారు. తాను అప్పుడప్పుడు కాలుస్తున్నట్లు కూడా చెప్పారు. ఒబామా మాత్రం.. తాను మిషెల్ అంటే భయంతో సిగరెట్లు కాల్చే అలవాటు మానేసుకున్నట్లు చెప్పారు. గడిచిన ఆరేళ్ల నుంచి మిషెల్ భయంతో ఒక్క సిగరెట్టు కూడా ముట్టుకులేదని తెలిపారు. అధ్యక్షుడిగా ఎన్నికైన మొదట్లో కూడా తాను సిగరెట్లు బాగానే కాల్చేవాడినని అన్నారు. పిల్లల ముందు, కుటుంబం ముందు కూడా ఎప్పుడూ కాల్చలేదని తెలిపారు. ఎట్టకేలకు ఇప్పుడు మిషెల్ భయం పుణ్యమాని.. 95 శాతం వరకు తన పొగతాగే అలవాటు పోయిందని స్పష్టం చేశారు. పిల్లలు పెద్దవాళ్లయిపోతున్నందున వాళ్ల ముందు ఏదీ దాచడం కుదరదని, అందువల్ల సిగరెట్లు మానేయాల్సిందేనని మిషెల్ తనను ఆదేశించినట్లు ఒబామా చెప్పారు. -
భారతీయ రెస్టారెంట్లో మిషెల్‌కు ఒబామా బర్త్‌డే విందు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుట్టినరోజు సందర్భంగా భార్య మిషెల్‌కు భారతీయ వంటకాలను రుచి చూపించారు. వాషింగ్టన్ వెస్ట్ఎండ్లోని ఖరీదైన భారతీయ రెస్టారెంట్ ‘రసిక’లో ఈ జంట బుధవారం ఏకాంతంగా విందు చేసుకుంది. నోరూరించే రుచికరమైన వంటలకు ప్రసిద్ధి చెందిన రసిక రెస్టారెంట్ అవార్డులు కూడా గెలుచుకుంది. మోకాళ్ల వరకు పొడవున్న నల్ల రంగు గౌను ధరించిన మిషెల్‌తో కలిసి అధ్యక్షుడు శ్వేతసౌధం నుంచి వెళ్లటాన్ని కొందరు గమనించారు. ఒబామా ఎప్పటిమాదిరిగానే సూట్లో కనిపించారు. అత్యాధునికమైన లాంజ్‌తోపాటు వైన్ సెల్లార్, తండూరీ రోటీలకు రసిక పేరుపొందింది. ఢిల్లీలో జన్మించిన అశోక్ బజాజ్‌కు చెందిన నైట్బ్రైడ్ గ్రూప్ రసిర రెస్టారెంట్‌ను నిర్వహిస్తోంది. అమెరికాలోని ఇతర ప్రాంతాలతోపాటు లండన్‌లో కూడా ఈ గ్రూప్ 25 ఏళ్లకుపైగా హోటల్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. గత ఆదివారం తన 52వ జన్మదినోత్సవాన్ని ఒబామా తన కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో క్యాంప్ డేవిడ్‌లో గడిపారు.