భారతీయ రెస్టారెంట్‌లో మిషెల్‌కు ఒబామా బర్త్‌డే విందు | Obama, first lady Michelle on date night at Indian eatery | Sakshi
Sakshi News home page

భారతీయ రెస్టారెంట్‌లో మిషెల్‌కు ఒబామా బర్త్‌డే విందు

Published Fri, Aug 9 2013 8:55 PM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM

భారతీయ రెస్టారెంట్‌లో మిషెల్‌కు ఒబామా బర్త్‌డే విందు

భారతీయ రెస్టారెంట్‌లో మిషెల్‌కు ఒబామా బర్త్‌డే విందు

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుట్టినరోజు సందర్భంగా భార్య మిషెల్‌కు భారతీయ వంటకాలను రుచి చూపించారు. వాషింగ్టన్ వెస్ట్‌ఎండ్‌లోని ఖరీదైన భారతీయ రెస్టారెంట్ ‘రసిక’లో ఈ జంట బుధవారం ఏకాంతంగా విందు చేసుకుంది. నోరూరించే రుచికరమైన వంటలకు ప్రసిద్ధి చెందిన రసిక రెస్టారెంట్ అవార్డులు కూడా గెలుచుకుంది.

మోకాళ్ల వరకు పొడవున్న నల్ల రంగు గౌను ధరించిన మిషెల్‌తో కలిసి అధ్యక్షుడు శ్వేతసౌధం నుంచి వెళ్లటాన్ని కొందరు గమనించారు. ఒబామా ఎప్పటిమాదిరిగానే సూట్‌లో కనిపించారు. అత్యాధునికమైన లాంజ్‌తోపాటు వైన్ సెల్లార్, తండూరీ రోటీలకు రసిక పేరుపొందింది.

ఢిల్లీలో జన్మించిన అశోక్ బజాజ్‌కు చెందిన నైట్‌బ్రైడ్ గ్రూప్ రసిర రెస్టారెంట్‌ను నిర్వహిస్తోంది. అమెరికాలోని ఇతర ప్రాంతాలతోపాటు లండన్‌లో కూడా ఈ గ్రూప్ 25 ఏళ్లకుపైగా హోటల్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. గత ఆదివారం తన 52వ జన్మదినోత్సవాన్ని ఒబామా తన కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో క్యాంప్ డేవిడ్‌లో గడిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement