అమెరికా మొదటి మహిళ మిచెల్లీ ఒబామాకు హిల్లరీ క్లింటన్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. నవంబర్ 8న జరుగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే, మిచెల్లీని తన కేబినెట్లోకి తీసుకుంటానని డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలికల విద్యా వంటి పలు సమస్యలపై మిచెల్లీ ఎంతో అవగాహనతో ఉన్నారని, వాటిపై ఎక్కువగా ఫోకస్ చేయాలని మిచెల్లీ కోరుకుంటున్నట్టు హిల్లరీ పేర్కొన్నారు. ఉత్తర కాలిఫోర్నియాలోని విన్స్టన్-సాలెంలో తామిద్దరూ భేటీ అయిన సందర్భంలో ఈ విషయాలపై చర్చించినట్టు తెలిపారు.