'ఒబామా 2017లో చనిపోతాడు' | Wish Barack Obama Dies, First Lady Lives In A Cave With Gorilla: Trump's Ally | Sakshi
Sakshi News home page

'ఒబామా 2017లో చనిపోతాడు'

Published Sun, Dec 25 2016 8:42 AM | Last Updated on Fri, Aug 24 2018 8:06 PM

'ఒబామా 2017లో చనిపోతాడు' - Sakshi

'ఒబామా 2017లో చనిపోతాడు'

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఆయన సతీమణి మిషెల్లీ ఒబామాపై కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్‌ ట్రంప్‌ వర్గానికి చెందిన ఓ వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. జాత్యహంకార మాటలు అన్నారు. 2017లో ఒబామా చనిపోవాలని కోరుకుంటున్నానని, ఆయన భార్య మిషెల్లీ ఆఫ్రికా వెళ్లి అక్కడ చింపాంజీతో కలిసి ఓ గుహలో జీవించాల్సిందేనంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. 2017లో ఏం జరగాలని కోరుకుంటున్నారని ఓ మీడియా ప్రశ్నించగా అతను ఈ వ్యాఖ్యలు చేశారు.

డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ప్రచార సమయంలో న్యూయార్క్‌కు సంబంధించి కార్ల్‌ పలాడినో అనే ఓ వ్యాపార వేత్త, రిపబ్లికన్‌ పార్టీ నాయకుడు కో చైర్మన్‌గా పనిచేశారు. ఆయన గతంలో న్యూయార్క్‌ గవర్నర్‌గా కూడా పనిచేశారు. వచ్చే కొత్త ఏడాదిలో ఏం జరిగితే చూడాలని మీరు అనుకుంటున్నారు అని మీడియా ప్రశ్నిస్తే.. ఎద్దుల మందకు వచ్చే భయంకరమైన వ్యాధి అయిన కౌ డిసీజ్‌ ఒబామాకు వచ్చి ఆయనను పరీక్షలకు తీసుకెళ్లడానికి ముందే చచ్చిపోవాలనుకుంటున్నట్లు తెలిపారు.

ఆ తర్వాత మరో ఏడాదిలో మిషెల్లీ ఒబామా తిరిగి తన దేశం ఆఫ్రికా దేశమైన జింబాబ్వేకు వెళ్లి అక్కడే ఓ చింపాంజీతో కలిసి గుహలో జీవించాల్సిందేనంటూ అది తాను కోరుకుంటున్నానని వ్యాఖ్యానించాడు. ఈ మాటలపై ఒక్కసారిగా నిరసనలు పెల్లుబికాయి. సోషల్‌ మీడియాలో తీవ్ర ప్రతిస్పందనలు వచ్చాయి. జాత్యంహకార వ్యాఖ్యలు చేయడంలో ముందునుంచే పలాడినో అతి చేస్తుంటాడని పలువురు మండిపడ్డారు. కాగా, ఇలాంటి వాటిని తాము ఏమాత్రం ప్రోత్సాహించబోమని ట్రంప్‌ అధికార ప్రతినిధి ఒకరు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement