racial coments
-
పార్క్‌లో భారతీయ కుటుంబానికి అవమానం
సిడ్నీ: ఆస్ట్రేలియాలో భారతీయులపై మరో జాతి వివక్ష సంఘటన చోటుచేసుకుంది. గర్భవతి అయిన తన భార్యను కాస్తంత పక్కన కూర్చొబెట్టుకుంటారా అని అడిగినందుకు ఉత్సవ్ పటేల్ అనే భారతీయుడు, అతడి కుటుంబానికి సిడ్నీలో చేదు అనుభవం ఎదురైంది. ఆ సిడ్నీ మహిళ అతడిని, భారతీయులను, భారత్‌ను అనకూడని మాటలతో ద్వేషించింది. వారి నాలుగేళ్ల కూతురు భయంతో చూస్తుండగా జాతి వివక్ష పూరిత వ్యాఖ్యలు చేసింది. దీనిని ఉత్సవ్ తన కెమెరాలో రికార్డు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన ఏప్రిల్ 22న సిడ్నీలోని లూనా పార్క్‌లో చోటు చేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది. ఉత్సవ్ తెలిపిన వివరాల ప్రకారం పార్క్‌లో రైడింగ్ చేసేందుకు తన నాలుగేళ్ల కూతురు గర్భవతి అయిన భార్యతో కలసి వెళ్లాడు. అయితే, తన భార్య గర్భవతి కావడంతో కొద్ది సేపు వాకింగ్ చేసి తర్వాత అతడు రైడింగ్‌కు వెళ్లొచ్చేవరకు ఒక బెంచిపై కూర్చొబెట్టాలని అనుకున్నాడు. అప్పటికే దానిపై ఓ ఆస్ట్రేలియన్ మహిళ ఉండటంతో ఆమెను కాస్తంత కూర్చొబెట్టుకుంటారా అని అడిగినందుకు ఆమె అనకూడని మాటలు అనేసింది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. గో..గో..గో అంటో గోల చేసింది. తనకు భారతీయులంటే అస్సలు ఇష్టం లేదంటూ గట్టిగా అరిచింది. దీనిపై విచారణ వేగంగా సాగుతోంది. -
'ఒబామా 2017లో చనిపోతాడు'
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్లీ ఒబామాపై కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్ ట్రంప్ వర్గానికి చెందిన ఓ వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. జాత్యహంకార మాటలు అన్నారు. 2017లో ఒబామా చనిపోవాలని కోరుకుంటున్నానని, ఆయన భార్య మిషెల్లీ ఆఫ్రికా వెళ్లి అక్కడ చింపాంజీతో కలిసి ఓ గుహలో జీవించాల్సిందేనంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. 2017లో ఏం జరగాలని కోరుకుంటున్నారని ఓ మీడియా ప్రశ్నించగా అతను ఈ వ్యాఖ్యలు చేశారు. డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలో న్యూయార్క్‌కు సంబంధించి కార్ల్ పలాడినో అనే ఓ వ్యాపార వేత్త, రిపబ్లికన్ పార్టీ నాయకుడు కో చైర్మన్‌గా పనిచేశారు. ఆయన గతంలో న్యూయార్క్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. వచ్చే కొత్త ఏడాదిలో ఏం జరిగితే చూడాలని మీరు అనుకుంటున్నారు అని మీడియా ప్రశ్నిస్తే.. ఎద్దుల మందకు వచ్చే భయంకరమైన వ్యాధి అయిన కౌ డిసీజ్ ఒబామాకు వచ్చి ఆయనను పరీక్షలకు తీసుకెళ్లడానికి ముందే చచ్చిపోవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆ తర్వాత మరో ఏడాదిలో మిషెల్లీ ఒబామా తిరిగి తన దేశం ఆఫ్రికా దేశమైన జింబాబ్వేకు వెళ్లి అక్కడే ఓ చింపాంజీతో కలిసి గుహలో జీవించాల్సిందేనంటూ అది తాను కోరుకుంటున్నానని వ్యాఖ్యానించాడు. ఈ మాటలపై ఒక్కసారిగా నిరసనలు పెల్లుబికాయి. సోషల్ మీడియాలో తీవ్ర ప్రతిస్పందనలు వచ్చాయి. జాత్యంహకార వ్యాఖ్యలు చేయడంలో ముందునుంచే పలాడినో అతి చేస్తుంటాడని పలువురు మండిపడ్డారు. కాగా, ఇలాంటి వాటిని తాము ఏమాత్రం ప్రోత్సాహించబోమని ట్రంప్ అధికార ప్రతినిధి ఒకరు అన్నారు.