వాషింగ్టన్ : భారత సంతతికి చెందని కమలా హ్యారిస్ అమెరికా ప్రభుత్వంలో రెండో అత్యున్నత పదవిని అలంకరించే అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత మూలాలున్న కమలా హ్యారిస్ ఎంపికయ్యారు. ఈ విషయంపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్లి ఒబామా హర్షం వ్యక్తం చేశారు. రంగుతో సంబంధం లేకుండా ఓ మహిళ తనను తాను ఎంతో గొప్పగా ఎదిగిన తీరును ప్రశంసించింది. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న కమలా హ్యారీస్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తూ ఓ పోస్టును షేర్ చేసింది. ఈ సందర్భంగా మిషెల్లీ మాట్లాడుతూ...''మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఈ యుద్ధంలో మీ పనితనంపై విమర్శలు చేసేవాళ్లు చాలా మంది ఉంటారు. మీరు ఈ పదవికి అర్హురాలు కాదని నినదించే వాళ్లూ ఉంటారు. అవన్నీ పట్టించుకోవద్దు. మీ పనితనంపై మాకు నమ్మకం ఉంది. చిన్న వయసులోనే మీ లక్ష్యాన్ని చేరేందుకు శ్రమిస్తున్నారు. (కమలా హ్యారిస్‌పై నోరు పారేసుకున్న ట్రంప్)
మార్పు నెమ్మదిగా రావచ్చొమో కానీ కశ్చితంగా మొదలవుతుంది. మీ పురోగతికి సంకేతాలు కనిపిస్తున్నాయి. జమైకా, భారతీయ మూలాలున్న ఓ వలసదారుల కుమార్తె నేడు ఓ ప్రధాన పార్టీ తరపున ఉపాధ్యక్ష అభ్యర్థిగా మొదటి నల్లజాతి మహిళగా, ఆసియా-అమెరికన్ మహిళగా మీరు రికార్డు నెలకొల్పారు. నవతరం అమ్మాయిలు సైతం తమలాగే కనిపించే వారు కూడా అధ్యక్షులుగా ఎదిగి దేశాన్ని ముందుకు నడిపించవచ్చు అని మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. వారిలో కూడా ఆ ఆత్మవిశ్వాసాన్ని రేకిత్తించారు. ఎందుకంటే కమలా హ్యారిస్ మొదటివారు కావచ్చు కానీ చివరివారు కాదు'' అంటూ ఎంతో భావోద్వేగంతో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ చదువుతున్నంత సేపు గూస్‌బంప్స్ వచ్చాయి అంటూ పలువురు ఉద్వేగానికి లోనయ్యారు.
ఇక విశేష రాజకీయ అనుభవం, గొప్ప పాలనా చాతుర్యం, అద్భుతమైన వాదనాపటిమ ఉన్న కమలా హ్యారిస్‌ను తన లెఫ్ట్‌నెంట్‌గా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఎంచుకున్నారు. కమలా హ్యారిస్ తండ్రి డొనాల్డ్ హ్యారిస్‌ది జమైకా. తల్లి శ్యామల గోపాలన్ ఇండియన్(చెన్నై). అలా ఆఫ్రో, ఆసియన్ మూలాలున్న కమల ప్రస్తుతం కాలిఫోర్నియా సెనేటర్‌గా ఉన్నారు. జో బైడెన్ ప్రచార వ్యూహాలను పర్యవేక్షిస్తున్నారు. అమెరికా ఓటర్లలో కీలకమైన భారతీయులు సహా ఆసియన్లు, ఆఫ్రికన్ల ఓట్లను ఆమె కచ్చితంగా ప్రభావితం చేయగలరన్న అభిప్రాయం యూఎస్ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. (నేనెప్పుడు దోశ వేయలేదు: కమలా హారిస్)
Comments
Please login to add a commentAdd a comment