అమెరికా ప్రథమ పౌరురాలు, అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్లీ ఒబామా తన అద్భుతమైన ప్రసంగంతో ఆహూతులను కట్టిపడేశారు. డెమొక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు మద్దతు ప్రకటిస్తూ మిషెల్లీ చేసిన ప్రసంగం ‘నభూతో’ అన్నతరహాలో ఆద్యంతం పార్టీ శ్రేణులను మంత్రముగ్ధులను చేసింది. అమెరికాకు తొలిసారిగా మహిళా అధ్యక్షురాలు కావడం ఎంత ప్రయోజనకరమో చెప్తూనే.. సందర్భోచితంగా ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై వాగ్బాణాలు సంధించారు.