ఒబామా మనసులో ఏముంది? | Obama unhappy with Michelle Obama in political issue | Sakshi
Sakshi News home page

ఒబామా మనసులో ఏముంది?

Published Sun, Oct 30 2016 10:47 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 PM

ఒబామా మనసులో ఏముంది?

ఒబామా మనసులో ఏముంది?

తన భార్య మిషెల్లీ ఒబామాకు అసలు రాజకీయాలంటేనే ఇష్టం ఉండదని ఇటీవల చెప్పిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తాజాగా మరో విషయాన్ని వెల్లడించారు. ఒబామా శనివారం ఓ రేడియో షోలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ.. అధ్యక్ష పదవి కోసం తన భార్య ఎప్పుడూ పోటీ చేయదని, ఆ పదవిపై ఆమెకు మోజు లేదని తెలిపారు. వచ్చే నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మిషెల్లీ ఒబామా ప్రజలకు ఎంతగానో దగ్గరయ్యారు.

నార్త్ కరోలినాలో దాదాపు 10వేల మంది డెమొక్రటిక్ పార్టీ మద్ధతుదారులు ఉన్న ఓ కార్యక్రమానికి మిషెల్లీ హాజరుకాగా, ఆమెను చూసిన వాళ్లు అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పేరుగా బదులుగా మిషెల్లీ పేరుతో నినాదాలు చేశారు. అధ్యక్ష ఎన్నికలలో నెగ్గి వైట్ హౌస్ లో కాలుపెట్టేది హిల్లరీనా.. లేక మిషెల్లీనా అనే తరహాలో అక్కడ సీన్ మారిపోయింది. ఈ విషయాలపై ఒబామా స్పందిస్తూ.. మిషెల్లీకి అధ్యక్షురాలిగా ఉండటానికి కావలసిన ఓపిక, రాజకీయాలపై ఆసక్తి రెండూ లేవని పేర్కొన్నారు.

తన భార్య మిషెల్లీ చాలా తెలివైనదని, ఎంతో నేర్పరి అని ఒబామా కొనియాడారు. అయినా ఆమెను చూస్తే తనకు గర్వంగా లేదన్నారు. తమ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మిషెల్లీ కాకపోవడంపై ఒబామా తనలో చిన్నపాటి బాధను, తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement