‘‘ఎలా మొదలైంది..ఎలా కొనసాగుతోంది’’ భావోద్వేగ పోస్ట్‌ వైరల్‌ | Michelle Obama wedding anniversary post for Barack Obama viral | Sakshi
Sakshi News home page

Wedding Anniversary: ‘‘ఎలా మొదలైంది..ఎలా సాగుతోంది’’ భావోద్వేగ పోస్ట్‌

Published Mon, Oct 4 2021 11:50 AM | Last Updated on Mon, Oct 4 2021 12:33 PM

Michelle Obama wedding anniversary post for Barack Obama viral - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా,  మిచెల్లీ ఒబామా దంపతులు తమ సుదీర్ఘ వైవాహిక జీవితాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.  ప్రతీ వార్షికోత్సవం, వాలెంటైన్స్‌ డేకి పరస్పరం అభినందిచుకోవడం ఈ దంపతులకు  అలవాటు. ఈ క్రమంలో అక్టోబరు 3  ఆదివారం, 29 వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మిచెల్లీ ఒక పోస్ట్‌ పెట్టారు.  తన హబ్బీ కోసం  పెట్టిన ఒక స్వీట్ పోస్ట్‌ వైరల్‌గా మారింది. దీంతో ఈ ఒబామా దంపతులకు శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది.  ఈ సందర్భంగా ఆమె రెండు ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్‌ ఇప్పటికే 2.7 మిలియన్లకు పైగా లైక్స్‌ను సాధించడం విశేషం. అందమైన జంట..హ్యాపీ యానివర్సరీ కమెంట్ల  జోరు కొనసాగుతోంది.

తమ పెళ్లి రోజు సందర్భంగా మెచెల్లీ   భర్త ఒబామాకు ఇన్‌స్టాగ్రామ్‌లో  విషెస్‌ అందించారు.  ఎలా ప్రారంభమైంది.. ఎలా కొనసాగుతోంది అంటూ తమ అపురూపమైన జర్నీని గుర్తు చేసుకున్నారు.  లవ్‌ యూ బరాక్‌ అంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఒబామాతో కలిసి ఉన్న అప్పటి, ఇప్పటి రెండు ఫోటోలను షేర్‌ చేశారు.  

కాగా 1992, అక్టోబర్ 3 న వివాహం చేసుకున్నారు ఒబామా, మిచెల్లీ. వీరికి మలియా (23) సాషా (20) ఇద్దరు సంతానం. గత ఏడాది తమ 28వ వార్షికోత్సవ సందర్భంగా 2020 అధ్యక్షఎన్నికల్లో జోబైడెన్‌ విజయంకోసం ఓటువేయాల్సిందిగా ప్రజలను ప్రోత్సహించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement