ట్రంప్‌పై మిషెల్లీ ఒబామా ఆగ్రహం | Not My America Or Your America Its Our America Michelle To Trump | Sakshi
Sakshi News home page

ట్రంప్‌పై మిషెల్లీ ఒబామా ఆగ్రహం

Published Sat, Jul 20 2019 3:06 PM | Last Updated on Sat, Jul 20 2019 6:00 PM

Not My America Or Your America Its Our America Michelle To Trump - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా దిగువ సభలోని మైనారిటీ మహిళా సభ్యులపై ఆదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆదేశ మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సతీమణి మిషెల్లీ ఒబామా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది నా అమెరికా కాదు, నీ అమెరికా కాదు.. మన అమెరికా’ అంటూ ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం ఆమె ట్విట్టర్‌ వేదికగా ట్రంప్‌ పేరు ప్రస్తావించకుండానే విమర్శలు గుప్పించారు. ‘‘ఈ దేశాన్ని ప్రపంచంలో గొప్పగా నిలబెట్టేది ఇక్కడి వైవిధ్యం. నేను చాలా సంవత్సరాల నుంచి ఈ అందాన్ని చూస్తున్నాను. మనం ఇక్కడ పుట్టిన వారమే కావచ్చు లేదంటే వలస వచ్చిన వారమే కావచ్చు.. కానీ, ప్రతి ఒక్కరికి ఈ నేలపై హక్కుంది. మనం ఒక్క విషయం తప్పక గుర్తుకు పెట్టుకోవాలి. అమెరికా నీదో, నాదో కాదు. మనందరి అమెరికా’’ అని మిషెల్లీ హితవుపలికారు.
 
ఓ ప్రచార సభలో ట్రంప్ మాట్లాడుతూ అమెరికా దిగువ సభలోని నలుగురు నల్లజాతీ సభ్యులను ‘మీ స్వదేశానికి వెళ్లిపోండి’ అంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్‌ వ్యాఖ్యలకు అనుగుణంగా సభకు హాజరైన ప్రజల్లో చాలా మంది ‘వారిని వెళ్లగొట్టండి’ అంటూ నినాదాలు చేశారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెళ్లువెత్తుత్తున్నాయి. అధ్యక్షుడిగా జాతివ్యతిరేక వ్యాఖ్యలు చేయడంగా సరికాదని అభిప్రాయపడుతున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement