ప్రత్యేక ఆకర్షణగా మిషెల్ ఒబామా!
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్ ఒబామా ఆదివారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఒబామా వెంట ఎక్కడికి వెళ్లినా తన ప్రత్యేకత నిలుపుకునే మిషెల్ భారత్ పర్యటనలోనూ దాన్ని కొనసాగించారు. ముఖ్యంగా ఆమె ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
న్యూయార్క్ లో ఉంటున్న భారత సంతతికి చెందిన డిజైనర్ బిభు మహాపాత్ర డిజైన్ చేసిన దుస్తులు ఆమె ధరించారు. జియోమెట్రిక్- ప్రింట్ బ్లాక్, తెలుపు , నీలం రంగు కలయికతో చూడగానే ఆకట్టుకునేవిధంగా ఈ డ్రెస్ రూపొందించారు. ఇక సెలబ్రిటీ మహిళలకు దుస్తులు రూపొందించడంతో బిభు మహాపాత్ర పేరు గాంచారు.