మిచెల్లీ ఒబామాకు హిల్లరీ బంపర్ ఆఫర్
మిచెల్లీ ఒబామాకు హిల్లరీ బంపర్ ఆఫర్
Published Tue, Nov 1 2016 1:13 PM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM
అమెరికా మొదటి మహిళ మిచెల్లీ ఒబామాకు హిల్లరీ క్లింటన్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. నవంబర్ 8న జరుగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే, మిచెల్లీని తన కేబినెట్లోకి తీసుకుంటానని డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలికల విద్యా వంటి పలు సమస్యలపై మిచెల్లీ ఎంతో అవగాహనతో ఉన్నారని, వాటిపై ఎక్కువగా ఫోకస్ చేయాలని మిచెల్లీ కోరుకుంటున్నట్టు హిల్లరీ పేర్కొన్నారు. ఉత్తర కాలిఫోర్నియాలోని విన్స్టన్-సాలెంలో తామిద్దరూ భేటీ అయిన సందర్భంలో ఈ విషయాలపై చర్చించినట్టు తెలిపారు.
తనకు ఉత్తమమైన భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాని, మిచెల్లీని మళ్లీ ప్రభుత్వంలోకి తీసుకోవాలని ఆశిస్తున్నట్టు క్లింటన్ ఓ టీవీ చానెల్కు చెప్పారు. ఒకవేళ నవంబర్ 8న జరిగే సాధారణ ఎన్నికల్లో హిల్లరీ గెలిస్తే, అమెరికాకు ఎన్నికైన మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఆమె పేరొందనున్నారు. క్యాంపెయిన్ తుదిదశలో క్లింటన్ ప్రత్యామ్నాయంగా మిచెల్లీ కొన్ని ర్యాలీలో పాల్గొన్నారు. మొదటిమహిళగా ఆమె ఎంతో ఆదర్శప్రాయురాలని, ఆ బాధ్యత ఎలా ఉంటుందో తనకు తెలుసని క్లింటన్ అన్నారు. మిచెల్లీ తనకందించిన ధైర్య, సహాకారాలను తాను అభినందిస్తున్నానని క్లింటన్ చెప్పారు.
Advertisement
Advertisement