నెట్‌ను కుదిపేస్తున్న మిషెల్లీ ఫొటో!
ఆమె అందరినీ ప్రేమిస్తుంది. ఆమెను అందరూ ప్రేమిస్తారు.. ఆమె ఎవరంటే అమెరికా ప్రథమ పౌరురాలు.. ఫ్లోటస్ మిషెల్లీ ఒబామా. ఆమె ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. వాషింగ్టన్‌లో ఆఫ్రికన్-అమెరికన్ చరిత్ర, సంస్కృతి జాతీయ మ్యూజియం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ అరుదైన కలయిక తటస్థించింది. ఈ సందర్భంగా మిషెల్లీ బుష్‌ను ఆలింగనం చేసుకుంటున్న ఫొటో సహజంగానే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
అమెరికా చరిత్రలో నల్లజాతీయుల ప్రాధాన్యాన్ని వివరిస్తూ సాగిన ఈ కార్యక్రమంలో బుష్, ఒబామా సైతం ఒకే ధోరణిలో ప్రసంగించారు. ఒక దేశ చరిత్రలోని వాస్తవాలను మరుగన పరచడం సరికాదని, అమెరికా చరిత్రలో నల్లజాతీయుల ప్రాధాన్యాన్ని గుర్తించాలని వారు పేర్కొన్నారు. వారి ప్రసంగం ఎలా ఉన్నా నెటిజన్ల దృష్టి మాత్రం మిషెల్లీ-బుష్ ఫొటోపై పెట్టారు. ఈ ఫొటోపై చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. పోస్టులు పెట్టారు. తమ ఫొటోషాప్ పైత్యమంతా ఈ ఫొటోపై చూపించారు. వారి విన్యాసాలు కావాలంటే మీరు కూడా చూడొచ్చు.