George Bush
-
ప్రపంచాన్ని చీకట్లో ముంచెత్తిన రోజు ఇది
20 Years For 9/11 Attacks: 9/11 ఉగ్రదాడులు. సెప్టెంబర్ 11, 2001.. ఈరోజు అమెరికా చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచాన్ని కొద్దిగంటలు చీకట్లోకి నెట్టేసిన రోజు. ట్విన్ టవర్స్, పెంటగాన్‌లపై వైమానిక దాడుల తర్వాత.. కరెంట్, ఇంటర్నెట్, శాటిలైట్, రేడియో ఫ్రీక్వెన్సీ కట్టింగ్లతో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రపంచం మొత్తం భయాందోళలకు లోనైంది. ఇంతకీ దాడి టైంలో అప్పటి అధ్యక్షుడు బుష్ ఎక్కడున్నాడు? ఇప్పటి అధ్యక్షుడు బైడెన్ గురించి లాడెన్ ఆనాడు ఏం చెప్పాడు? 9/11 దాడులకు ఇరవై ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రత్యేక కథనం.. సెప్టెంబర్ 11 ఉగ్రదాడులు.. చరిత్రలోనే ఇప్పటిదాకా రికార్డు అయిన అతిపెద్ద ఉగ్రమారణహోమం. 11 ఎకరాల విస్తీర్ణంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లోకి హైజాక్ విమానాల ద్వారా ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. ప్రత్యక్షంగా సుమారు నాలుగు వేల మంది ప్రాణాల్ని బలిగొన్నారు. ఈ దాడి తర్వాత రకరకాల గాయాలతో, జబ్బులతో చనిపోయిన వాళ్ల సంఖ్య చాలా చాలా ఎక్కువ. నష్టపరిహారం కోసం ఇప్పటిదాకా 67,000 దరఖాస్తులు వచ్చాయి. వీసీఎఫ్(విక్టిమ్ కాంపంజేషన్ ఫండ్) ద్వారా 40 వేలమందికి పైగా.. దాదాపు 9 బిలియన్ల డాలర్ల నష్టపరిహారాన్ని అందజేసినట్లు నిర్వాహకురాలు రూపా భట్టాచార్య చెప్తున్నారు. ఈ లెక్కన బాధితుల సంఖ్య ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కారణాలు.. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద మారణహోమానికి అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ కారణమని చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో ఇజ్రాయెల్‌తో అమెరికా స్నేహహస్తం, సోమాలియా, మోరో అంతర్థ్యుద్దం(ఫిలిఫ్ఫైన్స్), రష్యా, లెబనాన్, కశ్మీర్(భారత్)లలో హింసాత్మక ఘటనలు, ముస్లింల అణచివేత, ఇస్లాం వ్యతిరేక కుట్రలకు అమెరికా వెన్నుదన్నుగా నిలిచిందన్నది అల్‌ఖైదా ప్రధాన ఆరోపణ. అంతేకాదు సౌదీ అరేబియా గడ్డపై యూఎస్ భద్రతా దళాల మోహరింపు, ఇరాక్‌కు వ్యతిరేకంగా ఆంక్షల విధింపు.. తదితర కారణాలు అమెరికాపై ఉగ్రవాద దాడులకు అల్‌ఖైదాను ఉసిగొల్పాయనేది వాదన. నాలుగోది ఫ్లాప్.. పక్కా ప్రణాళిక.. విమానం నడపడంలో శిక్షణ పొందిన 19 మంది ఉగ్రవాదులు. ఐదుగురు మూడు గ్రూపులుగా, నలుగురు ఒక గ్రూప్‌గా విడిపోయారు. సెప్టెంబర్ 11, 2001 ఉదయం మొత్తం నాలుగు విమానాల్ని హైజాక్ చేశారు. మొదటి ఫ్లైట్ అమెరికన్ ఎయిర్‌లైన్స్11ను.. ఉదయం 8గం.46ని.కు మాన్‌హట్టన్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్‌ను ఢీకొట్టారు. పదిహేడు నిమిషాల తర్వాత రెండో విమానం(యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 175) వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌత్ టవర్‌ను ఢీకొట్టింది. కేవలం గంటా నలభై రెండు నిమిషాల్లో 110 అంతస్తుల ట్విన్ టవర్స్ చూస్తుండగానే కుప్పకూలిపోయాయి. మంటలు.. దట్టమైన పొగ, ఆర్తనాదాలు, రక్షించమని కేకలు, ప్రాణభీతితో ఆకాశ హార్మ్యాల నుంచి కిందకి దూకేసిన భయానక దృశ్యాలు ఆన్కెమెరా రికార్డు అయ్యాయి. ఆ దాడులతో రెండు కిలోమీటర్ల మేర భవనాలు సైతం నాశనం అయ్యాయి. దట్టంగా దుమ్ము అలుముకుని మొత్తం ఆ ప్రాంతాన్ని పొద్దుపొద్దున్నే చీకట్లోకి నెట్టేశాయి ఉగ్రదాడులు. 9/11.. పెంటగాన్ దాడి దృశ్యం ఇక మూడో దాడి.. డల్లాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన విమానాన్ని ఓహియో వద్ద హైజాక్ చేశారు. వర్జీనియా అర్లింగ్టన్ కౌంటీలోని పెంటగాన్ పడమర భాగాన్ని ఉదయం 9గం.37ని. నిమిషాలకు ఢీకొట్టారు. నాలుగో విమానం.. ఉ.10.03ని. సమయంలో పెన్సిల్వేనియా షాంక్స్విల్లే దగ్గర మైదానాల్లో క్రాష్ ల్యాండ్ అయ్యింది. బహుశా ఇది వైట్ హౌజ్ లేదంటే యూఎస్ పార్లమెంట్ భవనం లక్క్ష్యంగా దూసుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మొత్తానికి భద్రతా దళాలు, రక్షణ దళాలు అప్రమత్తం అయ్యేలోపే ఊహించని ఘోరం జరిగిపోయింది. బుష్ చెవిలో ఊదింది ఆయనే సెప్టెంబర్ 11, 2001.. మంగళవారం ఉదయం. ఆనాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్.. ఉదయాన్నే చాలా నీరసంగా ఉన్నారు. అయినప్పటికీ కరోలీ బూకర్ ఎలిమెంటరీ స్కూల్లో ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. పిల్లలతో ఇంటెరాక్ట్ అయిన టైంలో బుష్ చెవిలో ఏదో గొణిగాడు ఆండ్రూ కార్డ్. ఈయన వైట్‌హౌజ్‌లో చీఫ్ స్టాఫ్‌గా పని చేశాడు అప్పుడు. అయితే వాళ్లకు దాడి గురించి ప్రాథమిక సమాచారం తప్పుగా అందింది. ఓ చిన్న విమానం.. అదీ పైలెట్‌కు గుండెపోటు వల్ల జరిగిందన్న సమాచారంతో పొరబడి ఆ దుర్ఘటనలపై విచారం వ్యక్తం చేశారు వాళ్లు. కాసేపటికే అదొక కమర్షియల్ జెట్‌లైనర్ విమానమని, భారీ ఉగ్రదాడి అనే క్లారిటీ వచ్చింది. సెకండ్ గ్రేడ్ క్లాస్ రూంలో వైట్ హౌజ్ స్టాఫ్, యూఎస్ నేవీ కెప్టెన్ అంతా అధ్యక్షుడు బుష్‌తో భేటీ అయ్యారు. ఆటైంలోనే యూబీఎల్ అనే పేరును ప్రెసిడెంట్ బుష్ వద్ద ప్రస్తావించాడు కార్డ్. యూబీఎల్.. అంటే వుసామా బిన్ లాడెన్. ఈ దాడులకు సరిగ్గా నెల రోజుల క్రితం అమెరికాపై దాడులకు పాల్పడతామని లాడెన్ బెదిరించినట్లు సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీ వైట్ హౌజ్‌కు నివేదిక సమర్పించిన విషయాన్ని కార్డ్ గుర్తు చేశాడు. కాసేపటికే పెంటగాన్ దాడి వార్త అందాక బుష్‌ను వైట్‌హౌజ్‌కు కాకుండా.. రహస్య ప్రాంతానికి తరలించి తర్వాతి ప్రణాళిక మీద చర్చలు జరిపారు. అఫ్గన్ ద్వారా వేట సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో చాలా మార్పులొచ్చాయి. ఆసియన్ దేశాల విషయంలో పాశ్చాత్య దేశాల ధోరణి పూర్తిగా మారిపోయింది. ట్రావెల్ బ్యాన్-ఆంక్షలు, మతవిద్వేష దాడులు పేట్రేగిపోయాయి. ఇక అల్‌ఖైదా మీద ప్రతీకారంతో అప్గన్ ఆక్రమణ చేపట్టిన అమెరికా సైన్యం.. ఒసామా బిన్‌లాడెన్ కోసం వేట మొదలుపెట్టింది. అయితే తొలుత ట్విన్ టవర్స్ దాడులతో తనకేం సంబంధం లేదని ప్రకటించుకున్న లాడెన్.. ఆ తర్వాత మూలకారకుడు తానే అని ఒప్పుకున్నట్లు వీడియో ఆధారాలు వెలుగు చూశాయి. దాడి జరిగిన పదేళ్ల తర్వాత 2011, మే 1న అబ్బోట్టాబాద్ (పాక్) దగ్గర అమెరికా సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్’లో లాడెన్ హతం అయినట్లు అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. బైడెన్ గురించి లాడెన్ లేఖ! తాజా అఫ్గన్ పరిణామాలు దాదాపు అందరికీ తెలిసినవే. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోగా.. తిరిగి తాలిబన్లు ఆక్రమణకు పాల్పడ్డారు. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే తాలిబన్లు బిన్ లాడెన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 9/11 దాడుల్లో లాడెన్ ప్రమేయం లేదని, లాడెన్‌కు వ్యతిరేకంగా అమెరికా దొంగ సాక్క్క్ష్యాలు సృష్టించిందని, ఆధిపత్య ధోరణితో అఫ్గన్‌లో అమెరికా సైన్యం మోహరించిందంటూ వరుస ప్రకటనలు విడుదల చేశారు. ఇక అల్‌ఖైదా నేత బిన్ లాడెన్.. 2010లో రాసిన ఓ లేఖ తాలిబన్ పరిణామాల తర్వాత తెర మీదకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడి పోటీలో జో బైడెన్ పేరు తెర మీదకు రావడాన్ని ఒసాబా బిన్ లాడెన్ స్వాగతించాడని 48 పేజీల లేఖ ఒకటి విడుదల అయ్యింది. ‘బైడెన్ అధ్యక్ష పదవికి ముందస్తుగా సిద్ధంగా లేడు. అతను గనుక అధ్యక్షుడు అయితే.. అమెరికా దానంతట అదే సంక్షోభంలోకి కూరుకుపోతుంది. బైడెన్ అసమర్థన పాలన అమెరికాను నాశనం చేస్తుంద’ని ఆ లేఖలో లాడెన్ పేరిట రాసి ఉంది. అమెరికా 9/11 ఉగ్రదాడులకు 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. - సాక్షి, వెబ్‌డెస్క్ -
‘చావు కోసం ఎదురుచూస్తున్నా.. ఆ ఆలోచనే ఇలా’
అక్షరాల ద్వారా చెప్పలేని భావాలను కార్టూన్ల ద్వారా పలికించవచ్చు. కొన్ని వాక్యాల్లో వర్ణించలేని భావాలని ఒకే ఒక బొమ్మ రూపంలో తెలియజేయడం కార్టూనిస్టుల ప్రత్యేకత. నవ్వించడం, కవ్వించడమే కాదు... ఆలోచింపజేయడం, మనసును ద్రవింపజేసే కార్టూన్లను రూపొందించడం కొంతమంది కళాకారులకే సొంతం. అమెరికాకు చెందిన వార్తా పత్రిక క్లారియన్ లెడ్జర్ ఎడిటోరియల్ కార్టూనిస్ట్ మార్షల్ రామ్సే కూడా ఆ కోవకు చెందిన వారే. ప్రస్తుతం.. అమెరికా మాజీ అధ్యక్షుడు, దివంగత నేత జార్జ్ హెచ్. డబ్ల్యూ బుష్ ఙ్ఞాపకార్థం ఆయన వేసిన కార్టూన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భార్య బార్బరా, కూతురు రాబిన్‌తో బుష్‌కు ఉన్న అనుబంధాన్ని ఈ కార్టూన్ చక్కగా వర్ణించిందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రామ్సే వేసిన కార్టూన్ సీనియర్ బుష్ అంత్యక్రియలు గురువారం పూర్తవనున్న విషయం తెలిసిందే. వాషింగ్టన్‌లోని నేషనల్ క్యాథడ్రల్ చర్చిలో అధికారిక లాంఛనాలతో ఓసారి, హూస్టన్‌లోని సెయింట్‌మార్టిన్ ఎపిస్కోపల్ చర్చిలో మరోసారి ఆయనకు వీడ్కోలు పలుకుతామని అధికారులు వెల్లడించారు. అయితే హూస్టన్‌లో ఆయన భార్య బార్బరా, కుమార్తె రాబిన్ పక్కన బుష్ పార్థివదేహాన్ని ఖననం చేయనుండటంతో దీని ఆధారంగా రామ్సే కార్టూన్ రూపొందించారు. ఫ్లైట్‌లో ప్రయాణించిన బుష్.. ఆయన భార్య బిడ్డలను చేరుకున్నట్టుగా కార్టూన్ వేసిన రామ్సే... ‘మీ కోసం ఇన్నాళ్లు ఎదురుచూశాం’ అంటూ అందులో అక్షరాలు పొందుపరిచారు. మార్షల్ రామ్సే ఇప్పుడు చావు కోసం ఎదురుచూస్తున్నా! ‘ఒకప్పుడు చావు అంటే నాకు చాలా భయం ఉండేది. చనిపోతాననే భయం నన్ను ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. కానీ కొన్ని రోజులుగా చావు కోసం ఎదురుచూస్తున్నా. ఎందుకంటే చనిపోయిన తర్వాత మనకు ఇష్టమైన, స్వర్గంలో ఉన్న మన ప్రియమైన వారిని కలుసుకోవచ్చు. అమెరికా మాజీ ప్రథమ మహిళ బార్బరా చనిపోయిన తర్వాత ఆమె ఙ్ఞాపకార్థం గీసిన కార్టూన్ ఈ ఆలోచన నుంచి పుట్టిందే. ప్రస్తుతం వేసిన జార్జ్ బుష్ కార్టూన్ అందరి మనసులను హత్తుకుంటోంది. ముఖ్యంగా జార్జ్ బుష్ మనుమరాలు జెన్నా బుష్ హాగర్ ఈ కార్టూన్ చూసి భావోద్వేగానికి లోనైంది’ అని రామ్సే తన ఫేస్బుక్ పేజీలో రాసుకొచ్చారు. నేవీ పైలట్.. ప్రియమైన భర్త.. తండ్రి జార్జ్ బుష్- బార్బరా బుష్లది 73 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక జీవితం. గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలో ఏర్పడిన వీరి పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత అనతికాలంలోనే వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఎంతో అన్యోన్యంగా మెదిలిన ఈ జంట ప్రతీ విషయంలో ఒకరికి ఒకరు అండగా నిలిచేవారు. బుష్‌కు సంబంధించిన ప్రతీ కార్యక్రమంలోనూ బార్బరా భాగమయ్యేవారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో బార్బరా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో బుష్ కుంగిపోయారు. భార్య మరణించిన నాటి నుంచి అనారోగ్యంతో పూర్తిగా చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. సుమారు ఏడు నెలల వ్యవధిలో ఈ దంపతులు మరణించారు. లుకేమియాతో కుమార్తె మృతి... జార్జ్ బుష్- బార్బరా దంపతులకు ఆరుగురు సంతానంతో పాటు మనుమలు, మనుమరాల్లు, మునిమనవలతో కూడిన అందమైన కుటుంబం ఉంది. వీరికి 1950లో ఈ జంటకు ఓ కుమార్తె జన్మించింది. ఆమె పేరు పౌలిన్ రాబిన్సన్. మూడేళ్ల ప్రాయంలో అంటే 1953లో లుకేమియా(క్యాన్సర్) బారిన పడి రాబిన్ మరణించింది. తమ జీవితంలో అత్యంత విషాదకర ఘటన రాబిన్ మరణమేనని బుష్ దంపతులు అనేక సందర్భాల్లో గుర్తుచేసుకునేవారు. ఇక రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నేవీ పైలట్‌గా వ్యవహరించి అమెరికా సాధించిన పలు విజయాల్లో బుష్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయాల ఆధారంగా విమానం బొమ్మ వేసిన రామ్సే... స్వర్గంలో ఆయన బార్బరా, రాబిన్సన్లను కలుసుకుని ఆనందపడుతున్నట్లుగా మరో చిత్రాన్ని గీశారు. దీనికి సోషల్ మీడియాలో అనూహ్య స్పందన లభిస్తోంది. గతంలో ఆయన వేసిన బార్బరా కార్టూన్‌కు కూడా ఇదే తరహాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. బార్బరా బుష్ మరణానంతరం రామ్సే వేసిన కార్టూన్ వైరల్‌గా మరో ఫొటో! బుష్ ఙ్ఞాపకార్థం రామ్సే వేసిన కార్టూన్‌తో పాటుగా.. ఆయనకు సంబంధించిన మరో ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుష్ భౌతికకాయం వద్ద ఆయన పెంపుడు శునకం సలీ విచారంగా పడుకున్న ఫొటో నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. విశ్వాసానికి మారుపేరు శునకం అనే మాటను సలీ మరోసారి నిరూపించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
ఆయన అంతిమ ప్రయాణం అందులోనే!
వాషింగ్టన్ : అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన మాజీ అధ్యక్షుడు, దివంగత నేత జార్జ్ హెచ్. డబ్ల్యూ బుష్‌కు ఘనంగా నివాళులు అర్పించేందుకు ఆ దేశ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆయన భౌతికకాయాన్ని వాషింగ్టన్ తీసుకెళ్లేందుకు అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్ను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. బుష్ గౌరవార్థం ఈ విమానానికి తాత్కాలికంగా ‘స్పెషల్ ఎయిర్‌మిషన్ 41’ అని పేరు కూడా పెట్టారు. ఇక బుష్ పార్థివ దేహానికి వాషింగ్టన్లో నివాళులు అర్పించిన అనంతరం తిరిగి హూస్టన్‌కు తీసుకువచ్చిన తర్వాత టెక్సాస్‌లోని జార్జ్ హెచ్. డబ్ల్యూ బుష్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీలో సందర్శనార్థం ఉంచనున్నారు. ఇందుకు గానూ ‘4141’ అనే ప్రత్యేక రైలును ఉపయోగిస్తున్నారు. అంతిమ ప్రయాణం అందులోనే! సీనియర్ బుష్ అంతిమ ప్రయాణం ఆయన పేరు మీదుగా ఏర్పాటు చేసిన రైలులో సాగనుండటం విశేషం. అమెరికాలోని అతిపెద్ద రైలు రవాణా సంస్థ యూనియన్ పసిఫిక్ తమ దేశ 41వ అధ్యక్షుడు బుష్ గౌరవార్థం ఓ ప్రత్యేక లోకోమోటివ్ను రూపొందించింది. 4141 నంబరు గల ఈ లోకోమోటివ్ను 2005లో సీనియర్ బుష్ ప్రారంభించారు. తమ లోకోమోటివ్‌లకు భిన్నంగా 4141ను అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్ లుక్ ప్రతిబింబించేట్లుగా నీలం, తెలుపు రంగులో దీనిని రూపొందించారు. దీనిపై జార్జ్ బుష్ 41 అనే అక్షరాలను పొందుపరిచారు. స్వయంగా ఆయనే నడిపారు.. ‘4141 ఆవిష్కరణ సమయంలో నేను రైలు నడపవచ్చా అని బుష్ అడిగారు. చిన్నపాటి ట్రెయినింగ్, కొన్ని మెళకువలు చెప్పిన అనంతరం ఇంజనీర్ పర్యవేక్షణలో సుమారు రెండు మైళ్ల దూరం పాటు బుష్ లోకోమోటివ్ను నడిపారు’ అని యూనియన్ పసిఫిక్ రిటైర్డ్ జనరల్ డైరెక్టర్ మైక్ ఇడెన్ ఆనాటి ఙ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. 1969 తర్వాత మొదటిసారి.. మాజీ అధ్యక్షుల పార్థివ దేహాలను అంతిమ ప్రయాణానికి రైళ్లను ఉపయోగించే సంప్రదాయం అబ్రహం లింకన్ కాలం నాటి నుంచే కొనసాగుతోంది. అమెరికా మాజీ అధ్యక్షులు గ్రాంట్, గారీఫీల్డ్, మెకన్లే, హార్డింగ్, రూజ్వెల్ట్ భౌతిక కాయాలను కూడా రైళ్లలోనే తరలించినట్లు యూనియన్ పసిఫిక్ పేర్కొంది. అయితే 1969లో ఐసన్‌హోవర్ తర్వాత మొదటిసారిగా బుష్ పార్థివ దేహాన్ని తీసుకువెళ్లడానికి, ఆయన పేరు మీదుగా రూపొందించిన లోకోమోటివ్ను ఉపయోగించనుండటం తమకు ప్రత్యేకమని తెలిపింది. ‘రెండో ప్రపంచ యుద్ధంలో నేవీ పైలట్‌గా, అధ్యక్షుడిగా తన జీవిత కాలాన్నిఅమెరికా కోసం వెచ్చించిన అధ్యక్షుడు బుష్‌కు కృతఙ్ఞతలు. మీ గౌరవార్థం బుష్ లైబ్రరీ లోకోమోటివ్ను 2005లో ప్రత్యేకంగా రూపొందించాం. మీ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి’ అంటూ ట్విటర్ వేదికగా నివాళులు అర్పించింది. ఈ విధంగా బుష్‌ను చివరిసారిగా దర్శించుకుని, నివాళి అర్పించే అవకాశం 4141 ద్వారా టెక్సాన్లకు దక్కింది. కాగా వాషింగ్టన్‌లోని నేషనల్ క్యాథడ్రల్ చర్చిలో అధికారిక లాంఛనాలతో ఓసారి, హూస్టన్‌లోని సెయింట్‌మార్టిన్ ఎపిస్కోపల్ చర్చిలో మరోసారి బుష్ అంత్యక్రియలు జరగనున్నాయి. గురువారం హూస్టన్‌లో ఆయన భార్య బార్బరా, కుమార్తె రాబిన్ పక్కన బుష్ పార్థివదేహాన్ని ఖననం చేయనున్నారు. Thank you, President Bush, for a life of service, including serving as a Navy combat pilot in World War II. We were honored to pay you tribute with a custom-painted locomotive at the Bush Library in 2005. Our thoughts and prayers are with your family. #Bush41 pic.twitter.com/rPg96allQP — Union Pacific (@UnionPacific) December 1, 2018 -
బుష్ గౌరవార్థం ‘స్పెషల్ ఎయిర్‌మిషన్ 41’
హూస్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు దివంగత జార్జ్ హెచ్.డబ్ల్యూ.బుష్ భౌతికకాయాన్ని వాషింగ్టన్ తీసుకెళ్లేందుకు అధ్యక్షుడి అధికారిక విమానం ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ హూస్టన్‌కు చేరుకుంది. బుష్ గౌరవార్థం ఈ విమానానికి తాత్కాలికంగా ‘స్పెషల్ ఎయిర్‌మిషన్ 41’గా పేరుపెట్టారు. వాషింగ్టన్‌లోని నేషనల్ క్యాథడ్రల్ చర్చిలో అధికారిక లాంఛనాలతో ఓసారి, హూస్టన్‌లోని సెయింట్‌మార్టిన్ ఎపిస్కోపల్ చర్చిలో మరోసారి బుష్ అంత్యక్రియలు జరగనున్నాయి. గురువారం హూస్టన్‌లో ఆయన భార్య బార్బరా, కుమార్తె రాబిన్ పక్కన బుష్ పార్థివదేహాన్ని ఖననం చేయనున్నారు. మరోవైపు, బుష్ భౌతికకాయం వద్ద ఆయన పెంపుడు శునకం సల్లీ విచారంగా పడుకున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
సీనియర్ బుష్ కన్నుమూత
హూస్టన్: పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెర్బర్ట్ వాకర్ బుష్(94) శుక్రవారం కన్నుమూశారు. సీనియర్ బుష్‌గా పిలుచుకునే ఆయన 1989–1993 మధ్య కాలంలో అమెరికాకు 41వ అధ్యక్షుడిగా సేవలందించారు. నాటి అమెరికా విరోధి కూటమి సోవియెట్ యూనియన్ పతనం, కువైట్‌పై దురాక్రమణకు పాల్పడిన ఇరాక్ ఓటమిపాలవడం, జర్మనీ గోడ కూల్చివేత లాంటి చారిత్రక ఘటనలు ఆయన హయాంలోనే జరిగాయి. అదే కాలంలో పలు దేశాల్లో నియంతృత్వ పాలనకు తెరపడి స్వేచ్ఛావాద ప్రజాస్వామ్య వ్యవస్థలు మనుగడలోకి వచ్చాయి. బుష్ అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ‘ఉన్నత ప్రవర్తన కలిగిన మనిషి, ఒక బిడ్డ కోరుకునే అత్యుత్తమ తండ్రి’ అని ఆయన కొడుకు, మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ శ్లాఘించారు. మృతిపై భారత ప్రధాని మోదీ సహా వివిధ దేశాల నాయకులు విచారం వ్యక్తం చేశారు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో బుష్ చెక్కుచెదరని నాయకత్వ పటిమను ప్రదర్శించారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అమెరికా గొప్ప మార్గదర్శకుడు, విధేయుడైన సేవకుడిని కోల్పోయిందని మాజీ అధ్యక్షుడు ఒబామా అన్నారు. ఎక్కువ కాలం బతికిన అధ్యక్షుడు.. 1924 జూన్ 24న మసాచుసెట్స్‌లోని ధనవంతుల కుటుంబంలో జన్మించిన బుష్ ఈ ఏడాది 94 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. దీంతో ఎక్కువ కాలం బతికి ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడిగా గుర్తింపు పొందారు. అమెరికాలోని పెరల్ హార్బర్‌పై జపాన్ దాడి తరువాత 18 ఏళ్ల ప్రాయంలోనే నేవీలో పైలట్‌గా నియమితులై, అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 1945లో బార్బరా పియర్స్‌ను పెళ్లాడారు. బార్బరా ఏప్రిల్‌లో చనిపోయారు. వారికి ఆరుగురు సంతానం. వారి కొడుకు జార్జ్ బుష్ జూనియర్ అమెరికాకు 43వ అధ్యక్షుడిగా పనిచేశారు. మాజీ అధ్యక్షుడు కెన్నడీ కుటుంబం తరువాత అమెరికా రాజకీయాల్లో ఎక్కువ పదవులు చేపట్టింది బుష్ కుటుంబమే. సీనియర్ బుష్ అంత్యక్రియలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ హాజరవుతారని అధ్యక్ష భవనం వైట్‌హౌస్ శనివారం వెల్లడించింది. ‘అణు’ ముప్పు తప్పించారు తన కుటుంబం స్థిరపడిన టెక్సాస్ నుంచి బుష్ రెండుసార్లు రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. 1971లో అప్పటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్..బుష్‌ను ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా నియమించారు. 1980 ఎన్నికల్లో రొనాల్డ్ రీగన్ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో బుష్ ఉపాధ్యక్షుడయ్యారు. ఈ జోడి 1984లోనూ గెలవడంతో బుష్ ఉపాధ్యక్షునిగా ఎనిమిదేళ్లు ఉన్నారు. తర్వాత రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీచేసి 1989లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1991, 93లలో రెండు కీలక వ్యూహాత్మక ఆయుధాల నియంత్రణ ఒప్పందాలపై సంతకం చేసి సీనియర్ బుష్ ప్రపంచానికి అణ్వాయుధ ముప్పును తప్పించారు. ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(నాఫ్తా) రూపకల్పనకు తీవ్రస్థాయిలో సంప్రదింపులు జరిపారు. బుష్ అమెరికా అధ్యక్షుడుకాకముందు నావికా దళంలో పైలట్‌గా, నిఘా సంస్థ సీఐఏకు చీఫ్‌గా పనిచేశారు. 1990లో కువైట్‌పై యుద్ధానికి దిగిన ఇరాక్..సౌదీ అరేబియాలోకి కూడా చొరబడేందుకు యత్నించింది. అదే జరిగితే ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌కు ప్రపంచంలోని మొత్తం ముడి చమురు నిల్వల్లో 40 శాతం వశమయ్యేవి. ఈ ముప్పును గ్రహించిన సీనియర్ బుష్ 32 దేశాల సేనల్ని ఏకం చేసి ఇరాక్‌పై ముప్పేట దాడి ప్రారంభించారు. ఆపరేషన్ డెజర్ట్ పేరిట చేపట్టిన ఈ ఆపరేషన్‌తో సద్దాం సైన్యాన్ని తరిమికొట్టారు. 2011లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ది ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను స్వీకరించారు. 84ఏళ్ల వయసులో బుష్ స్కైడైవింగ్(ఫైల్) -
సీనియర్ బుష్ కన్నుమూత
వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్. డబ్ల్యూ. బుష్(94) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. 1989లో అమెరికా 41వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన పాలనలో తనదైన ముద్ర వేసి కీర్తి గడించారు. కాగా ఆయన మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామ, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తదితర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు.. సీనియర్ బుష్‌గా సుపరిచితులైన జార్జ్ హర్బర్ట్ వాకర్ బుష్ జూన్ 12, 1924లో మసాచుసెట్స్‌లోని మిల్టన్‌లో జన్మించారు. ఆయన ముద్దు పేరు పాపీ. బుష్ జన్మించిన కొద్ది కాలానికే ఆయన కుటుంబం గ్రీన్విచ్కు వెళ్లి స్థిరపడింది. దీంతో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. తర్వాత ఉన్నత విద్యకై 1938లో మసాచుసెట్స్‌లోని ఫిలిప్స్ అకాడమీలో చేరిన బుష్... స్టూడెంట్ కౌన్సిల్ సెక్రటరీ, కమ్యూనిటీ ఫండ్ రైజింగ్ గ్రూపు అధ్యక్షుడు, స్కూల్ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ మెంబర్, బేస్‌బాల్, సాకర్ టీమ్స్ కెప్టెన్‌గా చిన్నతనంలోనే పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఇలా చిన్ననాటి నుంచే ఆయనకు నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధకాలంలో.. నేవీ అధికారిగా 18 ఏట గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం(1941) బుష్ అమెరికా నౌకాదళంలో చేరారు. 10 నెలల శిక్షణ అనంతరం యూఎస్ నావల్ రిజర్వ్ విభాగంలో నావల్ ఏవియేటర్(పైలట్)గా నియమితులయ్యారు. టీనేజ్లోనే ఈ ఘనత సాధించిన బుష్ రికార్డు ఇప్పటి వరకు చెక్కుచెదరలేదు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నేవీ అధికారి, ఫొటోగ్రఫిక్ ఆఫీసర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించిన బుష్.. అమెరికా సాధించిన పలు విజయాల్లో భాగస్వామి అయ్యారు. ప్రేమ- పెళ్లి.. కుటుంబం గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలోనే జార్జ్ బుష్‌కు బార్బరా పియర్స్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం స్నేహితులుగా మెదిలిన వీరు.. ప్రేమికులుగా మారారు. ఆ తర్వాత వివాహబంధంతో ఒక్కటయ్యారు. బార్బరా-బుష్ దంపతులది 73 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక జీవితం. వారికి ఐదుగురు సంతానం (వీరిలో జార్జ్ బుష్ (జూనియర్) అమెరికా 43వ అధ్యక్షుడిగా పనిచేశారు). 17 మంది మనవళ్లు, మనవరాళ్లు, ఏడుగురు మునిమవళ్లు, మునిమనవరాళ్లు ఉన్నారు. కాగా బార్బరా పియర్స్ బుష్(93) ఈ ఏడాది ఏప్రిల్‌లో కన్నుమూశారు. వ్యాపార- రాజకీయ జీవితం... రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన అనంతరం బుష్ కుటుంబం టెక్సాస్‌కు వెళ్లి స్థిరపడ్డారు. ఆ తర్వాత తండ్రి వ్యాపారాన్ని విస్తరించడంలో దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా 1953లో జపాటా పెట్రోలియం కార్పోరేషన్ అనే సంస్థను ప్రారంభించి 1966 వరకు దానికి చైర్మన్‌గా కొనసాగారు. రిపబ్లికన్ పార్టీలో చేరిన బుష్.. 1963లో టెక్సాస్‌లోని హ్యారిస్ కంట్రీ చైర్మన్‌గా పదవి చేపట్టి రాజకీయ జీవితం ప్రారంభించారు. పౌర హక్కుల బిల్లు కోసం పోరాడిన బుష్.. 1966లో హౌజ్ ఆఫ్ రిప్రంజేటివ్స్కు ఎంపికయ్యారు. సెనేటర్‌గా, అమెరికా గూఢాచార సంస్థ(సీఐఏ) డైరెక్టర్‌గా, రొనాల్డ్ రీగాన్ హయాంలో ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1989లో అమెరికా 41వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాగా జూనియర్ బుష్(బుష్ తనయుడు) తన తండ్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఎనిమిదేళ్లకే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం విశేషం. కొడుకు జార్జ్ డబ్ల్యూ బుష్‌తో సీనియర్ బుష్ -
బుష్ కుటుంబంలో విషాదం
మిడ్‌లాండ్(టెక్సాస్): అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్(సీనియర్) సతీమణి బార్బరా పియర్స్ బుష్(92) కన్నుమూశారు. వృద్ధాప్యంలోనూ చలాకీగా వ్యవహరించే ఆమె మంగళవారం ఇంట్లో ఉన్నప్పుడే గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారని బుష్ కుటుంబ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. బార్బరా మరణంతో బుష్ కుటుంబంలో విషాదం నెలకొంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలు దేశాల ప్రముఖులూ బుష్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. 16 ఏళ్లకే ప్రేమ-పెళ్లి: 1925, జూన్ 8న మాన్‌హట్టన్‌లో జన్మించిన బార్బరా పియర్స్ ఆష్లే హాల్ స్కూల్లో గ్రాడ్యువేషన్ పూర్తిచేశారు. ఆమెకు 16 ఏళ్లు ఉన్నప్పుడు జార్జ్ బుష్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత వారు వివాహబంధంతో ఒక్కటయ్యారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో టెక్సాస్‌కు వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. అనంతరకాలంలో బుష్ రాజకీయాల్లో ఎదిగి రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వారిలో జార్జ్ బుష్(జూనియర్) కూడా దేశాధ్యక్ష పదవి చేపట్టడం తెలిసిందే. ఫస్ట్‌లేడీగా ఉన్న రోజుల్లో అక్షరాస్యత వ్యాప్తి కోసం బార్బరా కృషిచేశారు. బార్బరా-బుష్ దంపతుల 73 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక జీవితం. వారికి ఐదురు సంతానం. 17 మంది మనవళ్లు, మనవరాళ్లు, ఏడుగురు మునిమవళ్లు, మునిమనవరాళ్లు ఉన్నారు. సీనియర్ బుష్ (93) సైతం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. Statement by the Office of @GeorgeHWBush on the passing of Barbara Pierce Bush this evening at the age of 92. pic.twitter.com/c6JU0xy6Vc — Jim McGrath (@jgm41) 17 April 2018 3. President and Mrs. Bush were married for 73 years. pic.twitter.com/B5P3iOMGU2 — Yashar Ali 🐘 (@yashar) 17 April 2018 -
సీనియర్ బుష్ లైంగికంగా వేధించారు’
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్(93) తనను లైంగికంగా వేధించారని అమెరికన్ నటి హీథర్ లిండ్ ఆరోపించారు. 2014లో ఓ టెలివిజన్ షో స్క్రీనింగ్‌కు హాజరై ఫొటో దిగుతుండగా.. వీల్‌చైర్‌లో ఉన్న బుష్ తన వెనకవైపు అసభ్యంగా తాకారని విమర్శించారు. ‘ఆయన (బుష్) నాతో కరచాలనం చేయలేదు. పైగా భార్య బార్బరా బుష్ చూస్తుండగానే వీల్‌చైర్‌లో కూర్చొని నా వెనుకవైపు అసభ్యంగా తాకారు. తర్వాత ఓ బూతు జోక్ వినిపించారు. అనంతరం ఫొటో దిగుతున్న సమయంలో మళ్లీ అసభ్యంగా తాకారు. దీంతో అలా చేయొద్దంటూ ఆయన భార్య బార్బరా కళ్లతో సైగలు చేశారు’ అని హీథర్ లిండ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. -
అమెరికా మాజీ అధ్యక్షుడిపై నటి సంచలన ఆరోపణలు
వాషిగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షడు జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్(సీనియర్)పై ప్రముఖ నటి హెయిథర్ లిండ్ సంచలన ఆరోపణలు చేశారు. బుష్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆ సమయంలో ఆయన భార్య కూడా పక్కనే ఉన్నారని లిండ్ వెల్లడించారు. #meetoo ట్యాగ్‌ను జోడించి మంగళవారం ఆమె చేసిన ట్విట్.. నిమిషాల్లోనే సినీ, రాజకీయ వర్గాల్లో దావానలాన్ని రేపింది. నటి ఏం చెప్పారంటే.. : ‘‘నేను నటించిన ఓ టీవీ షో ప్రమోషన్లో భాగంగా యూనిట్ ముఖ్యులతో కలిసి మాజీ అధ్యక్షుడు జార్జిబుష్ నివాసానికి వెళ్లాం. ఆ సమయంలో బుష్ వెంట ఆయన భార్య బార్బరా కూడా ఉన్నారు. కొన్ని మాటల అనంతరం ఫొటో దిగేందుకు దగ్గరికి జరగ్గా.. బుష్ తన చేతితో నా వెనుకభాగాన్ని నిమిరారు. బుష్ చర్యను ఆయన భార్య గమనించినా, మిన్నకుండిపోయారు. తర్వాత ఇంకా దగ్గరికి పిలిచి, నా చెవిలో ఒక బూతు జోక్ చెప్పారు’’ అని నటి హెయిథర్ లిండ్ రాసుకొచ్చారు. అంత దగ్గరగా ఎందుకు నిల్చున్నావ్? : నేటికి సరిగ్గా నాలుగేళ్ల కిందట ఈ సంఘనట జరిగిందని లిండ్ పేర్కొన్నారు. బుష్ ప్రవర్తనపై అప్పటికప్పుడే ఆయన సెక్యూరిటీకి ఫిర్యాదు చేయగా, ‘మీరు అనవసరంగా ఆయనకు దగ్గరిగా వెళ్లారు’ అని వాళ్లు సమాధానమిచ్చినట్లు నటి తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభంజనంలా మారిన ‘మీ టూ’ క్యాంపెయిన్‌లో భాగంగా లిండ్ తాన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. సరదాగా చేశా.. క్షమించు : నటి లిండ్ చేసిన ఆరోపణలపై మాజీ ప్రెజిడెంట్ బుష్ గంటల వ్యవధిలోనే స్పందించారు. తాను కేవలం సరదాగానే చెయ్యివేశానని, మనసులో ఎలాంటి దురుద్దేశం లేదని, జరిగిన తప్పుకు క్షమాపణలు చెప్పుకుంటున్నానని అధికారిక ప్రకటన చేశారు. #meetoo : ప్రముఖ హాలీవుడ్ నటి అలిసా మిలానో ‘మీ టూ’ అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్‌స్టీన్ లైంగిక వేధింపులను ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్‌కి అనూహ్యమైన స్పందన లభించింది. మహిళలపై జరుగుతున్న వేధింపులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా గళమెత్తాలని ఆమె ఇచ్చిన పిలుపును అందుకుని సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు లక్షలాది మంది స్పందిస్తున్నారు. దాదాపు అన్ని దేశాల మహిళలు #meetoo ద్వారా చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. -
ట్రంప్‌కు షాకిచ్చిన జార్జిబుష్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. జార్జి బుష్ రిపబ్లికన్ పార్టీ తరఫునే రెండుసార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జార్జిబుష్ తండ్రి సీనియర్ బుష్ కూడా ఇదే పార్టీ తరఫున ఆ దేశ అధ్యక్షుడు అయ్యారు. దీంతో జార్జిబుష్ సాధారణంగా రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌కు ఓటు వేయాలి. అయితే ఆయన ట్రంప్‌కు ఓటు వేయలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు కానీ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు కానీ ఓటు వేయరాదని జార్జిబుష్ నిర్ణయించుకున్నారు. సొంత పార్టీకి చెందిన మాజీ అధ్యక్షుడు ఓటు వేయకపోవడం ట్రంప్‌కు ఇబ్బందికర పరిణామం. కాగా జార్జిబుష్ నిర్ణయం పార్టీలో, ఎన్నికల్లో తనపై ప్రతికూల ప్రభావం చూపదని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. జార్జిబుష్ నిర్ణయం బాధాకరమని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జార్జిబుష్ కుటుంబం ట్రంప్‌కు మద్దతు ఇవ్వలేదు. -
బర్త్‌డే బార్బీ
అందమైన లోకం! నేడు ఐశ్వర్యారాయ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఐశ్వర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు, విశేషాలు... ఐశ్వర్య సినిమా యాక్టర్ అవాలని కలలు కనలేదు! మెడిసిన్ చదవాలని అనుకున్నారు. అదీ పూర్తి చేయలేదు. చదువుకునే రోజుల్లో ఆమెకు ఇష్టమైన సబ్జెక్ట్ జువాలజీ. ఐశ్వర్య యంగ్ మోడల్‌గా ఉన్నప్పుడు ముంబైలో ఓరోజు ఐశ్యర్యను బాలీవుడ్ నటి రేఖ చూశారు. వెంటనే ఆ అమ్మాయిని గుర్తుపట్టి, ఆమెను పలకరించి, భుజం తట్టి ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు రేఖ. ఐశ్వర్య తొలి పెప్సీ యాడ్‌ని 1992-93లో ముంబై అల్లర్లు జరుగుతున్న సమయంలో సింగిల్ నైట్‌లో తీశారు. అందులో ఆమిర్ ఖాన్‌తో ఆమె నటించారు. పెప్సీకీ, కోక్కి నటించిన ఏకైక మహిళా మోడల్ ఐశ్వర్యే! ఐశ్వర్యకు ఇష్టమైన చిత్రం ‘కాసాబ్లాంకా’. ఇన్‌గ్రిడ్ బెర్గ్మన్ (హీరోయిన్), హంఫ్రీ బోగార్ట్ (హీరో) అందులో నటించారు. 1942 నాటి హాలీవుడ్ మూవీ అది. ఐశ్వర్యకు వాచీలను సేకరించడం ఇష్టం. ఆభరణాలు ధరించడం అయిష్టం. 2005లో బ్రిటన్‌లో ఐశ్యర్యను పోలిన బార్బీ డాల్స్ పరిమితంగా విడుదలయ్యాయి. మార్కెట్లోకి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే అవన్నీ అమ్ముడయ్యాయి!అప్పుడప్పుడే సినిమాల్లోకి వస్తున్న సమయంలో ఓ టీవీ సీరియల్‌కు డబ్బింగ్ చెప్పే అవకాశం వస్తే ఐశ్వర్య దానిని వదులుకున్నారు. 2005లో ప్లేబాయ్ మేగజన్ ఓనర్ హ్యూ హెఫ్నర్.. ఇండియన్ ఎడిషన్ కవర్ పేజీగా నిండైన వస్త్రాలతో ఐశ్వర్య ఫొటోను వెయ్యాలనుకున్నారు కానీ ఏవో కారణాల వల్ల ఆ ప్రయత్నం ఫలించలేదు. అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యు బుష్ 2006లో ఇండియా వచ్చినప్పుడు ఆయనతో కలిసి భోజనం చేయడానికి ఆమిర్‌ఖాన్‌తో పాటు ఐశ్వర్యకూ ఆహ్వానం అందింది. అయితే అప్పుడు ఐశ్వర్య ధూమ్-2 షూటింగ్ కోసం బ్రెజిల్లో ఉండడం వల్ల ఎంతో అరుదైన ఆ విందుకు వెళ్లలేకపోయారు. ఓసారి ఐశ్యర్య దుబాయ్‌లో భారీ ట్రాఫిక్ జామ్‌కు కారణం అయ్యారు! ఓ కమర్షియల్ యాడ్ చిత్రీకరణలో ఆమెను చూడడానికి అభిమానులు ఎగబడడంతో అలా జరిగింది. ‘ఓప్రా విన్ఫ్రే షో’లో పాల్గొన్న తొలి భారతీయ ప్రముఖురాలు ఐశ్వర్యారాయ్. మేడమ్ తుస్సాడ్స్ మైనపు బొమ్మల మ్యూజియంలో స్థానం దక్కించుకున్న తొలి భారతీయ నటి ఐశ్వర్య. నర్గీస్ తర్వాత, తనకన్నా వయసులో చిన్నవాడైన వ్యక్తిని పెళ్లి చేసుకున్న భారతీయ నటి.. ఐశ్వర్య. -
నెట్‌ను కుదిపేస్తున్న మిషెల్లీ ఫొటో!
ఆమె అందరినీ ప్రేమిస్తుంది. ఆమెను అందరూ ప్రేమిస్తారు.. ఆమె ఎవరంటే అమెరికా ప్రథమ పౌరురాలు.. ఫ్లోటస్ మిషెల్లీ ఒబామా. ఆమె ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. వాషింగ్టన్లో ఆఫ్రికన్-అమెరికన్ చరిత్ర, సంస్కృతి జాతీయ మ్యూజియం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ అరుదైన కలయిక తటస్థించింది. ఈ సందర్భంగా మిషెల్లీ బుష్‌ను ఆలింగనం చేసుకుంటున్న ఫొటో సహజంగానే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. అమెరికా చరిత్రలో నల్లజాతీయుల ప్రాధాన్యాన్ని వివరిస్తూ సాగిన ఈ కార్యక్రమంలో బుష్, ఒబామా సైతం ఒకే ధోరణిలో ప్రసంగించారు. ఒక దేశ చరిత్రలోని వాస్తవాలను మరుగన పరచడం సరికాదని, అమెరికా చరిత్రలో నల్లజాతీయుల ప్రాధాన్యాన్ని గుర్తించాలని వారు పేర్కొన్నారు. వారి ప్రసంగం ఎలా ఉన్నా నెటిజన్ల దృష్టి మాత్రం మిషెల్లీ-బుష్ ఫొటోపై పెట్టారు. ఈ ఫొటోపై చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. పోస్టులు పెట్టారు. తమ ఫొటోషాప్ పైత్యమంతా ఈ ఫొటోపై చూపించారు. వారి విన్యాసాలు కావాలంటే మీరు కూడా చూడొచ్చు. -
ప్రపంచంలో అతి పెద్ద హంతకుడు ఎవరు?
ప్రపంచంలో అతి పెద్ద హంతకుడు ఎవరు? అతడు ఎన్ని హత్యలు చేశాడు? మానవాళికి శాంతి, సహనాన్ని బోధించడంలో ఎవరు ముందున్నారు? తమ పరిశోధనలతో జీవన గమనాన్ని మార్చేసిన శాస్త్రవేత్తల్లో మిమ్మల్ని ప్రభావితం చేసినవారెవరు?.. ఇలా తమదైన ప్రత్యేక ముద్రతో అటు హీరోలుగా, ఇటు విలన్లుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తుల గురించి ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో ఆశ్చర్యకరమైన సమాధానాలు వెలుగుచూశాయి. పాకిస్థాన్, అర్జెంటీనా, దక్షిణ కొరియా, ఇటలీ, అమెరికా దేశాలకు చెందిన వివిధ యూనివర్సిటీల్లో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఆయా వర్సిటీలకు చెందిన దాదాపు 7వేల మంది విద్యార్థినీ విద్యార్థులు తాము ఆరాధించేవారితోపాటు అసహ్యించుకునే చరిత్రాత్మక వ్యక్తులెవరో కుండబద్దలు కొట్టారు. దాని ప్రకారం ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్.. హిస్టరీ హీరోల్లో ప్రధమ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో జీసస్ క్రైస్ట్, మదర్ థెరిసా, మహాత్మాగాంధీల కన్నా ఐన్్స్టీనే విద్యార్థుల ఆదరణ చూరగొన్నారు. ఇక ప్రపంచ విలన్ల విషయంలో మరిన్ని ఆశ్చర్యకరమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అఫ్ఘానిస్థాన్, ఇరాక్ తో యుద్ధంచేసి లక్షల మంది అమాయకుల్ని హత్యచేశారని ఆరోపిస్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్‌ను విలన్ల జాబితాలో చేర్చారు అధ్యయనంలో పాల్గొన్న విద్యార్థులు. సామ్యవాద స్థాపనలో తమకు అడ్డొచ్చినవాళ్లందరినీ హతమార్చిన కారణంగా రష్యా మాజీ పాలకులు స్టాలిన్, లెనిన్లు కూడా విలన్ల జాబితాలోనే చేరిపోయారు. ఇక జర్మనీ మాజీ నియంత అడాల్ఫ హిట్లర్ ప్రపంచ విలన్లలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అధ్యయనం వెల్లడించిన జాబితా ఇదే.. ప్రపంచ హీరోల జాబితా: 1 ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, 2 మదర్ థెరిసా, 3 మహాత్మా గాంధీ, 4 మార్టిన్ లూథర్ కింగ్, 5 ఐజక్ న్యూటన్, 6 జీసస్ క్రైస్ట్, 7 నెల్సన్ మండేలా, 8 థామస్ ఎడిసన్, 9 అబ్రహాం లింకన్, 10 గౌతమ బుద్ధుడు ప్రపంచ విలన్ల జాబితా: 1 అడాల్ఫ్ హిట్లర్, 2 ఒసామా బిన్ లాడెన్, 3 సద్దాం హుస్సేన్, 4 జార్జి బుష్, 5 స్టాలిన్, 6 మావో, 7 లెనిన్, 8 ఛెంఘీజ్ ఖాన్, 9 సలాద్దీన్ (ఈజిప్ట్ తొలి సుల్తాన్), 10 కిన్ షి హువాంగ్ (ఉమ్మడి చైనా పాలకుడు) -
జార్జిబుష్ కుమార్తె కోసం.. ఆయన హత్యకు కుట్ర
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జిబుష్ కుమార్తెను దక్కించుకునేందుకోసం ఏకంగా ఆయనను అంతమొందించాలని కుట్ర పన్నిన ఓ వ్యక్తిని న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్నుంచి బుల్లెట్లునింపిన రైఫిల్, కత్తి, పెట్రోల్ స్వాధీనం చేసుకున్నారు. ఓ ఫెడరల్ కోర్టులో దాఖలైన ఫిర్యాదు మేరకు బెంజమిన్ స్మిత్ (44).. బుష్ కూతురు బార్బరా బుష్ ప్రేమ పొందేందుకు ఆయనను అడ్డుతొలగించుకోవాలని పథకం వేశాడు. జార్జి బుష్‌ను కిడ్నాప్ చేసి, హత్య చేసేందుకు సిద్ధమయ్యాడు. జార్జిబుష్‌కు ఇద్దరు కవలలు ఉన్నారు. స్మిత్ తన పథకం గురించి రాసిన లేఖను ఇంట్లో అతని తల్లి కనుగొంది. ఆమె వెంటనే ఈ విషయాన్నిఅమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులకు తెలియజేసింది. డ్రాగన్‌లా చంపాలనుందని, అప్పడు బార్బరా తన సొంతమవుతుందని అందులో రాశాడు. అధ్యక్షుడు ఒబామా సహా అమెరికా అంతమవుతుందని పేర్కొన్నాడు. ఇంట్లో రైఫిల్ కనిపించకపోవడం, స్మిత్ కూడా అచూకీ లేకుండాపోవడంతో అతని తల్లి అధికారులకు తెలియజేసింది. స్మిత్ సెల్‌ఫోన్‌ను ట్రాక్ చేసి, అతను కారులో మన్హాటన్ వెళ్తుండా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు స్మిత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాను భార్యతో విడాకులు తీసుకున్నానని, బార్బరాను దక్కించుకునేందుకు కో్సం బుష్‌ను చంపేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పాడు.