ట్రంప్కు షాకిచ్చిన జార్జిబుష్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్కు ఊహించని షాక్ ఇచ్చారు. జార్జి బుష్ రిపబ్లికన్ పార్టీ తరఫునే రెండుసార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జార్జిబుష్ తండ్రి సీనియర్ బుష్ కూడా ఇదే పార్టీ తరఫున ఆ దేశ అధ్యక్షుడు అయ్యారు. దీంతో జార్జిబుష్ సాధారణంగా రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్కు ఓటు వేయాలి. అయితే ఆయన ట్రంప్కు ఓటు వేయలేదు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు కానీ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు కానీ ఓటు వేయరాదని జార్జిబుష్ నిర్ణయించుకున్నారు. సొంత పార్టీకి చెందిన మాజీ అధ్యక్షుడు ఓటు వేయకపోవడం ట్రంప్కు ఇబ్బందికర పరిణామం. కాగా జార్జిబుష్ నిర్ణయం పార్టీలో, ఎన్నికల్లో తనపై ప్రతికూల ప్రభావం చూపదని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. జార్జిబుష్ నిర్ణయం బాధాకరమని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జార్జిబుష్ కుటుంబం ట్రంప్కు మద్దతు ఇవ్వలేదు.