సీనియర్‌ బుష్‌ లైంగికంగా వేధించారు’ | George H.W. Bush Apologizes to Actress Who Alleged Sexual Harassment | Sakshi
Sakshi News home page

సీనియర్‌ బుష్‌ లైంగికంగా వేధించారు’

Published Thu, Oct 26 2017 5:06 AM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM

George H.W. Bush Apologizes to Actress Who Alleged Sexual Harassment - Sakshi

న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ హెచ్‌ డబ్ల్యూ బుష్‌(93) తనను లైంగికంగా వేధించారని అమెరికన్‌ నటి హీథర్‌ లిండ్‌ ఆరోపించారు. 2014లో ఓ టెలివిజన్‌ షో స్క్రీనింగ్‌కు హాజరై ఫొటో దిగుతుండగా.. వీల్‌చైర్‌లో ఉన్న బుష్‌ తన వెనకవైపు అసభ్యంగా తాకారని విమర్శించారు. ‘ఆయన (బుష్‌) నాతో కరచాలనం చేయలేదు. పైగా భార్య బార్బరా బుష్‌ చూస్తుండగానే వీల్‌చైర్‌లో కూర్చొని నా వెనుకవైపు అసభ్యంగా తాకారు. తర్వాత ఓ బూతు జోక్‌ వినిపించారు. అనంతరం ఫొటో దిగుతున్న సమయంలో మళ్లీ అసభ్యంగా తాకారు. దీంతో అలా చేయొద్దంటూ ఆయన భార్య బార్బరా కళ్లతో సైగలు చేశారు’ అని హీథర్‌ లిండ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement