మిసమిషెల్ | Observing Michelle Obama fashion | Sakshi
Sakshi News home page

మిసమిషెల్

Published Sat, Jan 31 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM

Observing Michelle Obama fashion

మనం ధరించిన దుస్తులను చూసి విదేశీయులు నచ్చి, మెచ్చి వాటిని గౌరవించడం మనకు తెలుసు. అయితే ఒక విదేశీ వనిత ధరించిన మన దేశీ దుస్తులు టాక్ ఆఫ్ ది వరల్డ్ కావడం.. అవి మనకు అద్భుతంగా అనిపించడం.. ఇప్పుడు ఆ స్టైల్స్‌ని అనుసరించడానికి ఫ్యాషన్ లవర్స్ ఆరాటపడటం.. జరుగుతోంది. అంటే నిజంగా ఆ విదేశీ వనితను అభినందించాల్సిందే. ఆ ఘనత దక్కించుకుంది మరెవరో కాదు మిషెల్ ఒబామా. ఇప్పుడు సిటీ ఫ్యాషన్ సర్కిల్‌లో టాక్ ఆఫ్ ది ట్రెండ్స్.                            .
.:: ఎస్.సత్యబాబు
 
అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా తన భర్తతో సహా మన దేశానికి వచ్చారు. తిరిగి వెళ్లనూ వెళ్లారు. మనదేశంతో అనుబంధాల గురించి మాట్లాడి ఒబామా భారతీయుల అభిమానాన్ని చూరగొన్నట్టే.. అద్భుతమైన డిజైనర్ దుస్తులతో మిషెల్ కూడా అందర్నీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు సిటీజనులకు ట్రెండ్ సెట్టర్ అయ్యారు.
 
క్రేజీ కాంబినేషన్...

మిషెల్ ధరించిన దుస్తులు క్రేజీ కాంబినేషన్‌గా అందరి మెప్పునూ పొందుతున్నాయి. పాపీ ప్రింట్ కోట్ కు కేప్ కోట్, సింపుల్ బ్లాక్ పంప్స్ కాంబినేషన్‌తో లుక్‌ని మెరిపించిన మిషెల్.. డ్రెస్సింగ్ ఇప్పుడు సిటీ డిజైనర్స్‌కు హాట్ ట్రెండ్ అయింది. సిటీలో పలువురు ఫ్యాషన్ ప్రియులైన అమ్మాయిలు మిషెల్ డ్రెస్సింగ్ స్టైల్‌ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తుండటంతో.. సిటీ డిజైనర్లు అర్జెంట్‌గా తమ అస్త్రాలకు పదును పెట్టి ఆ తరహాలో వెరైటీ డిజైన్లకు శ్రీకారం చుడుతున్నారు. బ్లూ ఫ్లోరల్ మోటిఫ్స్ ఉన్న బ్లాక్ అండ్ వైట్ నీ లెంగ్త్ డ్రెస్‌ను ఆమె ప్రత్యేకంగా మన భారత్ సందర్శన కోసం రూపొందించుకున్నారు. దీనిలో ఫ్లోరల్ ప్రింట్స్ అనేవి రానున్న స్ప్రింగ్ సమ్మర్‌కి  సంబంధించిన లేటెస్ట్ కలె క్షన్. దీన్ని ‘షీట్’ డ్రెస్ అని పిలుస్తారు. మిషెల్ ధరించిన దుస్తుల్లో కోట్, డ్రెస్ రెండింటికీ ఒకే ఫ్యాబ్రిక్ వాడారు. ఇది కొత్త ట్రెండ్. ఆమె ధరించిన దుస్తులకు వాడింది పాలియస్టర్ బ్లెండ్‌లో సూతింగ్ ఫ్యాబ్రిక్ అయి ఉంటుందని సిటీ డిజైనర్ నీరజ కోన అంటున్నారు.
 
భారతీయ డిజైన్ల అభిమాని...

తాజా మిషెల్ పర్యటన కోసం దుస్తుల్ని డిజైన్ చేసింది  జన్మతః ఒడిసాలోని రూర్కెలా వాసి, ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉంటున్న భారతీయ డిజైనర్ బిభూ మహాపాత్ర. భారతీయ డిజైన్లకు ప్రపంచవ్యాప్త కీర్తి తీసుకొచ్చారు మిషెల్. ఇప్పుడే కాదు అమెరికాలో వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌కు ఆమె జన్మతః ముంబై వాసి అయిన డిజైనర్ నయీమ్ ఖాన్ దుస్తులను ధరించారు.

గత 2010లో భారత సందర్శనకు వచ్చినప్పుడు కూడా ఆయనే రూపొందించిన మెటాలిక్ కాలమ్‌ను ధరించారు. అదే ఏడాది 33వ యాన్యువల్ కెన్నెడీ సెంటర్ హానర్స్ కార్యక్రమానికి సైతం ఆమె నయీమ్ డిజైన్ చేసిన స్లీవ్‌లెస్ గౌన్‌నే ధరించారు. తర్వాతి ఏడాది జర్మన్ చాన్స్‌లర్ అంజెలా మెర్కెల్ కోసం నిర్వహించిన స్టేట్ డిన్నర్‌లో ఆమె బ్రీడెడ్ కాలమ్ ధరించారు.

బ్రెజిలియన్ ప్రెసిడెంట్ డిల్మా రూసెఫ్‌ను కలిసేందుకు వెళ్లినప్పుడు కూడా ఆమె నీ లెంగ్త్ ఎంబ్రాయిడరీ డ్రెస్‌ను ఎంచుకున్నారు. 2012లో భారత్ సందర్శనకు వచ్చినప్పుడు కూడా న యీమ్ ఖాన్, రాచెల్‌రాయ్‌ల డిజైన్‌లను ధరించిన మిషెల్ ఇప్పుడు కూడా తన భారతీయ ఫ్యాషన్ ప్రియత్వాన్ని చాటుకున్నారు. పెద్దన్నలో అర్ధభాగమైన మిషెల్ ఒబామా డ్రెస్సింగ్ స్టైల్స్‌లో మన డిజైన్లు ఒక విడదీయలేని భాగం అయిపోవడం విశేషం.
 
ట్రెండీ డ్రెస్ అది...

మిషెల్ ఒబామా మన దేశానికి వచ్చినప్పుడు ధరించిన డ్రెస్ రియల్లీ ట్రెండీ.  దీని వల్ల ఇండియన్ డిజైనర్ బాగా టాక్ ఆఫ్ ది వరల్డ్ అయ్యారు. నీ లెంగ్త్ షీట్ డ్రెస్.  ఇప్పుడు సిటీలో చాలా మంది అమ్మాయిలు ఈ వెరైటీ కాంబినేషన్‌పై ఆసక్తి చూపుతున్నారు. భారతదేశ పర్యటనకు వచ్చారనే కాదు గతంలో కూడా అమెరికాలో తను పాల్గొన్న పలు కార్యక్రమాల్లో  మిషెల్ ఇండియన్ డిజైనర్లు రూపొందించిన దుస్తులను ధరించారు. అయితే ఈసారి డ్రెస్సింగ్ బాగా ఎలివేట్ కావడంతో గతంలో మిషెల్ ధరించిన ఇండియన్ డిజైనర్స్ డ్రెస్‌ల గురించి కూడా సిటీ  అమ్మాయిలు నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు.
 - నీరజ కోన, టాలీవుడ్ స్టైలిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement