
ఒబామా, మిషెల్లీ పెద్ద మనసు
వాస్తవానికి చికాగోలో ఇలాంటి కమ్యూనిటీ సెంటర్‌ను ఒకటి ఏర్పాటు అవడానికి ఇంకా నాలుగేళ్లు పట్టనుందని అందరూ భావిస్తుండగా అప్పటి వరకు తాము ఉండలేమంటూ స్వయంగా ఒబామా దంపతులు ముందుకొచ్చి ఈ విరాళం ప్రకటించారు. ‘మిషెల్లీ నేను వ్యక్తిగతంగా రెండు మిలిన్ డాలర్లను సమ్మర్ జాబ్స్ ప్రోగ్రామ్ కోసం విరాళంగా ప్రకటిస్తున్నాం. పని కోరేవారికి ఇది సరైన మార్గం.. దీని ద్వారా వారికి సదావకాశాలు అందించవచ్చు. మనందరం కలిసి పనేచేసేందుకు మరో నాలుగేళ్లపాటు మేం వేచి చూడలేం. అందుకే నేను, మిషెల్లీ ఇప్పుడే దానిని ప్రారంభించాలని అనుకుంటున్నాం’ అని ఆయన చెప్పారు.