నా బర్త్‌డే పార్టీకి భోంచేసి రండి | Michelle Obama asks guests to eat before coming to her birthday bash | Sakshi
Sakshi News home page

నా బర్త్‌డే పార్టీకి భోంచేసి రండి

Published Thu, Jan 9 2014 4:22 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM

నా బర్త్‌డే పార్టీకి భోంచేసి రండి

నా బర్త్‌డే పార్టీకి భోంచేసి రండి

వాషింగ్టన్: ఎవరైనా పుట్టినరోజు వేడుకల్లో ఏం చేస్తారు? కేక్ కట్ చేస్తారు. అనంతరం వారి హోదాకు తగ్గట్టుగా డిన్నర్ ఏర్పాటు చేస్తారు. మరి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా తన పుట్టినరోజును ఎలా జరుపుకోనున్నారా తెలుసా? భారీ హంగామాలు ఏమీ లేవు. పార్టీ ఇస్తారు.. కానీ భోజనం ఉండదు.
 
 ఆమె జన్మదిన వేడుకలకు ఆహ్వానం అందిన అతిథులు భోజనం చేసేసి పార్టీకి వెళ్లాలి. లేకుంటే వారికి ఆ పూట పస్తే! తన పార్టీలో ఎలాంటి ఆహారం ఉండదని, అందువల్ల అంతా ఇంటి దగ్గరే తినేసి రావాలని మిషెల్ స్వయంగా తన అతిథులకు సూచించారు. ఈనెల 17న అమెరికా ప్రథమ పౌరురాలు తన 50వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా మరుసటి రోజున శ్వేతసౌథంలో పార్టీ ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకలకు వచ్చే అతిథులు సౌకర్యవంతమైన బూట్లు వేసుకోవాలని, ముందుగానే డ్యాన్స్‌ప్రాక్టీస్ చేసుకోవాలని, సుష్టుగా తినేసి రావాలని మిషెల్ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement