న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కివీస్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్‌లను వీరిద్దరూ వదులుకున్నారు. ఫ్రాంచైజీ క్రికెట్ ఒప్పందాల దృష్ట్యా కాన్వే, అలెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వీరిద్దరూ తమ కాంట్రక్ట్ రెన్యూవల్‌పై సంతకం చేయలేదని కివీస్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
అయితే వీరిద్దరూ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నప్పటికి బ్లాక్‌క్యాప్స్ సెలెక్షన్‌కు మాత్రం అందుబాటులో ఉంటారని బోర్డు స్పష్టం చేసింది. ఈ డిసెంబర్‌లో అలెన్ బిగ్ బాష్ లీగ్‌లో ఆడనుండగా.. కాన్వే వచ్చే ఏడాది జనవరిలో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడనున్నాడు. కాగా ఇప్పటికే కేన్ విలియమ్సన్, లూకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, మిల్నే వంటి స్టార్ క్రికెటర్లు సైతం బోర్డు కాంట్రాక్ట్‌లను వదులు కున్నారు.
కివీస్ సెంట్రల్ ప్లేయింగ్ కాంట్రాక్ట్ నుండి నేను వైదొలగాలని నిర్ణయించుకున్నాను. నా అభ్యర్ధను అంగీకరించినందుకు న్యూజిలాండ్ క్రికెట్‌కు ధన్యవాదాలు. ఈ నిర్ణయం నేను అన్ని ఆలోచించే తీసుకున్నాను. నా కుటంబంతో కొద్ది రోజులు గడపాలనకుంటున్నాను. అదేవిధంగా బ్లాక్‌క్లాప్స్ తరపున ఆడేందుకు నేను ఎప్పుడూ సిద్దంగా ఉంటాను.
ఐసీసీ వరల్డ్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో ముఖ్యమైన టెస్టు సిరీస్‌లలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్‌లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేండుకు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాని న్యూజిలాండ్ క్రికెట్ విడుదల చేసే ప్రకటనలో డెవాన్ పేర్కొన్నాడు. కాగా అఫ్గానిస్తాన్, శ్రీలంకతో టెస్టు సిరీస్‌లకు కాన్వేకు న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment