టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12 సమరం ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో సిడ్నీ వేదికగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతోన్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 200 పరుగుల భారీ స్కోర్ సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో ఓపెనర్ డెవాన్ కాన్వే 58 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 92 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
అతడితో పాటు మరో ఓపెనర్ ఫిన్ అలెన్ కేవలం 16 బంతుల్లోనే 5ఫోర్లు, 42 పరుగులు చేసి కివీస్‌కు అద్భుతమైన ఆరంభం ఇచ్చాడు. ముఖ్యంగా న్యూజిలాండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన మిచిల్ స్టార్క్ వేసిన బౌలింగ్‌లో అలెన్ ఏకంగా 14 పరుగులు రాబట్టాడు. అదే ఓవర్‌లో మూడో బంతికి అలెన్ లాంగ్ ఆన్ మీదగా అద్భుతమైన సిక్స్ బాదాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో సునామీ ఇన్నింగ్స్ ఆడిన అలెన్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మిచెల్ స్టార్క్ వంటి స్టార్ బౌలర్‌కు ఇటువంటి షాట్ ఆడటం అంత ఈజీ కాదు అని కొనియాడుతున్నారు. ఇక అఖరికి 42 పరుగులు చేసిన అలెన్ జోష్ హాజిల్ వుడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
This was a crazy shot from Finn Allen. pic.twitter.com/b5ZeZz4iNa
— Johns. (@CricCrazyJohns) October 22, 2022
చదవండి: T20 WC 2022: టిమ్ సౌథీ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా
Comments
Please login to add a commentAdd a comment