
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే ఎంపికయ్యాడు. రాబోయే రెండు ఐపీఎల్ సీజన్లకు అతను సహాయ కోచ్‌గా కొనసాగనున్నట్లు ఢిల్లీ ఫ్రాంఛైజీ బుధవారం ప్రకటించింది. 2014-2019 మధ్య ఫ్రాంఛైజీ టాలెంట్ హెడ్‌గా పనిచేసిన 52ఏండ్ల ఆమ్రే..రికీ పాంటింగ్ నేతృత్వంలోని ప్రస్తుత కోచింగ్ సిబ్బందిలో చేరనున్నాడు. టీమ్‌ఇండియా తరఫున ఆమ్రే 11 టెస్టులు, 37 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్లో ఆటగాడిగా గొప్ప రాణించిన ఆమ్రే కోచింగ్ అనుభవం కూడా ఉంది. ముంబై మూడు రంజీ ట్రోఫీ టైటిళ్లు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.(చదవండి: ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండడు)
Comments
Please login to add a commentAdd a comment