సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌ను గెలిపించేందుకు హైదరాబాద్ బౌలర్లు శ్రమిస్తే... బ్యాటర్ల అలసత్వం జట్టుకు ఊహించని షాక్ ఇచ్చింది. ఓటమి తప్పదనుకున్న పోరులో ఢిల్లీ పోరాటం జట్టును 7 పరుగులతో గెలిపించింది. తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు చేసింది. మనీశ్ పాండే (27 బంతుల్లో 34; 2 ఫోర్లు), అక్షర్ పటేల్ (34 బంతుల్లో 34; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారంతే! వాషింగ్టన్ సుందర్ 3, భువనేశ్వర్ 2 వికెట్లు తీశారు. తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసింది. మయాంక్ (39 బంతుల్లో 49; 7 ఫోర్లు) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్, నోర్జే రెండేసి వికెట్లు తీశారు. ఐపీఎల్‌లో ఢిల్లీ చేతిలో హైదరాబాద్‌కిది వరుసగా ఐదో ఓటమి.
ఆదుకున్న ఆ ఇద్దరు...
ముందుగా హైదరాబాద్ బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాటర్లు విలవిల్లాడారు. జట్టును నడిపించే స్కోరుగానీ, ప్రేక్షకుల్ని అలరించే ఆటగానీ ఇన్నింగ్స్‌లో కరువైంది. సాల్ట్ (0) డకౌట్ కాగా, చకచకా 5 బౌండరీలు బాదిన మార్‡్ష (15 బంతుల్లో 25; 5 ఫోర్లు) ఆట ఐదో ఓవర్లోనే ముగిసింది. 8వ ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్ స్పిన్ ఉచ్చులో అనుభవజ్ఞుడైన వార్నర్ (20 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్), ఇంపాక్ట్ ప్లేయర్ సర్ఫరాజ్ (10), అమన్ హకీమ్ (4) చిక్కారు. 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో మనీశ్ పాండే, అక్షర్ పటేల్ ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు 69 పరుగులు జోడించారు.
బ్యాటర్ల నిర్లక్ష్యం...
తక్కువ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు ఆపసోపాలు పడింది. బ్రూక్ (7), తర్వాత త్రిపాఠి (21 బంతుల్లో 15)తో కలిసి వేగంగా ఆడిన మయాంక్ 12వ ఓవర్లో పెవిలియన్ చేరడంతో సీన్ మారిపోయింది. స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్ పటేల్ పిచ్ అనుకూలతలతో బంతుల్ని సుడులు తిప్పారు. అభిషేక్ శర్మ (5) మార్క్‌రమ్ (3) స్వల్ప వ్యవధిలో నిష్క్రమించడంతో 85 పరుగుల వద్ద 5 వికెట్లను కోల్పోయింది. చివర్లో క్లాసెన్ (19 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్), సుందర్ (15 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు)ల బౌండరీలతో సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ గాడిన పడింది. కానీ క్లాసెన్ వేగానికి నోర్జే బౌలింగ్‌లో చుక్కెదురవడంతో ఓటమి తప్పలేదు. హైదరాబాద్ విజయానికి ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా ‘ఇంపాక్ట్’ బౌలర్ ముకేశ్ కేవలం 5 పరుగులే ఇచ్చాడు.
స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) బ్రూక్ (బి) సుందర్ 21; సాల్ట్ (సి) క్లాసెన్ (బి) భువనేశ్వర్ 0; మార్‡్ష (ఎల్బీడబ్ల్యూ) (బి) నటరాజన్ 25; సర్ఫరాజ్ (సి) భువనేశ్వర్ (బి) సుందర్ 10; మనీశ్ పాండే (రనౌట్) 34; అమన్ (సి) అభిషేక్ (బి) సుందర్ 4; అక్షర్ (బి) భువనేశ్వర్ 34; రిపాల్ (రనౌట్) 5; నోర్జే (రనౌట్) 2; కుల్దీప్ (నాటౌట్) 4; ఇషాంత్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 144.
వికెట్ల పతనం: 1–1, 2–39, 3–57, 4–58, 5–62, 6–131, 7– 134, 8–139, 9–139.
బౌలింగ్: భువనేశ్వర్ 4–0–11–2, జాన్సెన్ 2–0–27–0, సుందర్ 4–0–28–3, నటరాజన్ 3–0–21–1, మార్కండే 4–0–34–0, ఉమ్రాన్ 2–0–14–0, మార్క్‌రమ్ 1–0–7–0.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: బ్రూక్ (బి) నోర్జే 7; మయాంక్ (సి) అమన్ (బి) అక్షర్ 49; రాహుల్ త్రిపాఠి (సి) సాల్ట్ (బి) ఇషాంత్ 15; అభిషేక్ (సి అండ్ బి) కుల్దీప్ 5; మార్క్‌రమ్ (బి) అక్షర్ 3; క్లాసెన్ (సి) అమన్ (బి) నోర్జే 31; సుందర్ (నాటౌట్) 24; జాన్సెన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 137.
వికెట్ల పతనం: 1–31, 2–69, 3–75, 4–79, 5–85, 6–126.
బౌలింగ్: ఇషాంత్ 3–0–18–1, నోర్జే 4–0–33–2, ముకేశ్ 3–0–27–0, అక్షర్ 4–0– 21–2, కుల్దీప్ 4–0–22–1, మార్‡్ష 2–0–16–0.
సన్‌రైజర్స్‌కు ఢిల్లీ షాక్
Published Tue, Apr 25 2023 4:42 AM | Last Updated on Tue, Apr 25 2023 8:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment