Praveen Amre
-
నో బాల్ రాద్ధాంతం.. పంత్, శార్దూల్‌లకు భారీ షాక్.. ఆమ్రేపై నిషేధం
DC VS RR: రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న (ఏప్రిల్ 22) జరిగిన హై ఓల్టేజీ సమరంలో నో బాల్ విషయంలో అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ చేసిన అనవసర రాద్ధాంతానికి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాకుండా ఫీల్డ్‌లో ఉన్న ఆటగాళ్లను రీకాల్ చేయడంపై కన్నెర్ర చేసిన ఐపీఎల్ యాజమాన్యం.. పంత్‌తో పాటు అతనికి మద్దతుగా నిలిచిన శార్దూల్ ఠాకూర్, అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేలపై చర్యలు తీసుకుంది. #DC#DC #RRvsDC #RishabhPant #NoBall #IPL2022 #ChotiBachiHoKya No ball Pant Gully Cricket 😅😅 #CSKvMI https://t.co/5izO2o75tX pic.twitter.com/XoS3DUc79d#ChotiBachiHoKya — Mankesh Meena (@Mankesh1212) April 23, 2022 ఈ మ్యాచ్ కోసం రిషబ్ పంత్‌కు లభించే మ్యాచ్ ఫీజు మొత్తంపై 100 శాతం కోత విధించగా, శార్దూల్ ఠాకూర్‌కు 50 శాతం జరిమానా పడింది. మ్యాచ్ మధ్యలో ఫీల్డ్‌లోకి వెళ్లి అంపైర్లతో వాగ్వాదానికి దిగినందుకు గాను ప్రవీణ్ ఆమ్రేపై 100 శాతం జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం విధించింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను అతిక్రమించినందుకు గాను ఈ ముగ్గురిపై చర్యలు తీసుకున్నట్లు మ్యాచ్ రిఫరి డేనియల్ మనోహర్ వెల్లడించాడు. కాగా, రాజస్థాన్ నిర్ధేశించిన 223 పరుగుల ఛేదనలో ఢిల్లీ గెలుపుకు 3 బంతుల్లో 18 పరుగులు అవసరమైన సందర్భంలో నో బాల్ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. మెక్ కాయ్ వేసిన ఓ బంతి నడుం కంటే ఎత్తుకు వెళ్లినప్పటికీ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ నో బాల్‌గా ప్రకటించకపోవడంతో ఢిల్లీ బృంద సభ్యులు ఓవరాక్షన్ చేశారు. అంపైర్ నిర్ణయం పట్ల అసహనానికి గురైన డీసీ సారధి డగౌట్లో నుంచి తమ ఆటగాళ్లను వెనక్కు రావల్సిందిగా సైగలు చేయగా, శార్ధూల్ అతనికి మద్ధతుగా నిలిచాడు. ఇదే సమయంలో మ్యాచ్‌కు అంతరాయం కలిగిస్తూ మైదానంలోకి వెళ్లిన ఆమ్రే అంపైర్‌తో వాగ్విదానికి దిగాడు. చదవండి: కెప్టెన్ పిలిస్తే ఊపుకుంటూ వెళ్లడమేనా.. కుల్దీప్ను మెడపట్టి తోసిన చహల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రేకు కీలక పదవి
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే ఎంపికయ్యాడు. రాబోయే రెండు ఐపీఎల్ సీజన్లకు అతను సహాయ కోచ్‌గా కొనసాగనున్నట్లు ఢిల్లీ ఫ్రాంఛైజీ బుధవారం ప్రకటించింది. 2014-2019 మధ్య ఫ్రాంఛైజీ టాలెంట్ హెడ్‌గా పనిచేసిన 52ఏండ్ల ఆమ్రే..రికీ పాంటింగ్ నేతృత్వంలోని ప్రస్తుత కోచింగ్ సిబ్బందిలో చేరనున్నాడు. టీమ్ఇండియా తరఫున ఆమ్రే 11 టెస్టులు, 37 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్లో ఆటగాడిగా గొప్ప రాణించిన ఆమ్రే కోచింగ్ అనుభవం కూడా ఉంది. ముంబై మూడు రంజీ ట్రోఫీ టైటిళ్లు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.(చదవండి: ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండడు) -
'ఆ నిర్ణయం నా కెరీర్‌ను ముంచేసింది'
ముంబై : టెస్ట్ క్రికెట్ ఆడాలనే లక్ష్యంతో 25 ఏళ్ల వయసులో బ్యాటింగ్ టెక్నిక్ మార్చుకోవాలనే తప్పుడు నిర్ణయం తన కెరీర్‌ను ముంచేసిందని భారత సీనియర్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు. ఈ తప్పిదం వల్లే తన బ్యాటింగ్‌లో దూకుడు తగ్గిందని, దాంతో కెరీర్ గ్రాఫ్ పడిపోయిందని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఊతప్ప తాజాగా ఆ జట్టు సోషల్ మీడియా వేదికగా నిర్వహించిన ఆన్లైన్ సెషన్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఊతప్ప తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ('థ్యాంక్యూ.. సారా అండ్ అర్జున్') 'భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటమే నా అతిపెద్ద లక్ష్యం. దానికి తగ్గట్టు 20-21 ఏళ్ల వయసులోనే ప్రయత్నాలు మొదలు పెడితే బాగుండేది. కానీ 25 ఏళ్ల వయసులో బ్యాటింగ్ టెక్నిక్ మార్చుకోవడం నాకు కీడు తలపెట్టింది. అప్పటివరకు స్థిరంగా ఆడుతూ వస్తున్న నా బ్యాటింగ్‌లో మునపటి పదును తగ్గింది. అయితే కెరీర్లో ఏ విషయం గురించి పశ్చాత్తాప పడవద్దనుకున్నా.. అత్యత్తుమ ప్రదర్శన కనబర్చాలనుకున్నా. అందుకే ఆ సమయంలో ప్రవీణ్ అమ్రే పర్యవేక్షణలో నా బ్యాటింగ్ టెక్నిక్ మార్చుకోవాలని నిర్ణయించుకొని మరింత మెరుగైన బ్యాట్స్‌మన్‌గా తయారవ్వాలనుకున్నా. ముఖ్యంగా గంటలకొద్దీ క్రీజులో ఉండి.. స్థిరంగా రాణించాలనుకున్నా. కానీ ఈ ప్రయత్నం విఫలమైంది.'అని ఊతప్ప చెప్పుకొచ్చాడు. 2006లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన ఊతప్ప.. జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన తను తర్వాత కనుమరుగయ్యాడు. 13 ఏళ్ల కెరీర్లో ఊతప్ప 46 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. చివరిసారిగా 2015లో జింబాబ్వే పర్యటనలో ఆడాడు. కాగా రాబిన్ ఊతప్ప అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా తరపున తొలి హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. (హ్యాపీ బర్త్‌డే జూ. ఎన్టీఆర్: వార్నర్) ('కష్టపడి సంపాదించాలి.. డిమాండ్ చేయొద్దు') -
ప్రవీణ్ ఆమ్రేపై ఆరోపణలు నిజమే..
ముంబై: మాజీ టెస్టు క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే, మాజీ కర్ణాటక స్పిన్నర్ రఘురామ్ భట్లు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నట్టు తేలింది. బీసీసీఐ ఏర్పాటు చేసిన అంబుడ్స్‌మన్ (విచారణాధికారి) జస్టిస్ ఏపీ షా విచారణలో ఈ విషయం తేటతెల్లమైంది. అయితే మాజీ కెప్టెన్ వెంగ్‌సర్కార్‌కు క్లీన్చిట్ లభించింది. ముంబై క్రికెట్ సంఘం మేనేజింగ్ కమిటీలో సభ్యునిగా వ్యవహరిస్తున్న ఆమ్రే అటు ఢిల్లీ డేర్‌డెవిల్స్ కోచింగ్ స్టాఫ్‌లోనూ ఉన్నారు. రఘురామ్ భట్ కర్ణాటక క్రికెట్ సంఘంలో మేనేజింగ్ కమిటీ సభ్యులుగా.. అండర్–16, 14 చైర్మన్‌గా ఉండడంతో పాటు బ్రిజేష్ పటేల్ క్రికెట్ అకాడమీ, ఐడీబీఐ అకాడమీలో పనిచేస్తున్నారు. ఇక ముంబై క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడు, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్‌గా ఉన్న వెంగీ పుణేలో క్రికెట్ అకాడమీ నడుపుతున్నారు. తన పదవులు రెండూ గౌరవపూర్వకమైనవేనని ఇచ్చిన వివరణపై షా సంతృప్తి వ్యక్తం చేశారు.