శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడేందుకు భారత జట్టు అన్ని విధాల సన్నద్దమైంది. జూలై 27న పల్లెకెలె వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తొలి టీ20కు ముందు భారత అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డోస్చేట్ జట్టుతో చేరాడు.
టీ20 వరల్డ్‌కప్-2024తో కోచింగ్ స్టాప్ రాహుల్ ద్రవిడ్ అండ్ కో పదవీ కాలం ముగిసిన సంగతి తెలిసిందే. ఒక్క ఫీల్డింగ్ కోచ్ టి. దిలిప్ మినహా మిగితా ఎవరూ కాంట్రాక్ట్‌లను బీసీసీఐ పొడగించలేదు. ఈక్రమంలో భారత జట్టు హెడ్‌కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఎంపికయ్యాడు.
అయితే సపోర్ట్ స్టాఫ్ ఎంపిక విషయంలో గంభీర్‌కు బీసీసీఐ పూర్తి స్వేఛ్చ ఇచ్చింది. దీంతో ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు తనతో కలిసి పనిచేసిన నెదర్లాండ్స్ క్రికెట్ దిగ్గజం ర్యాన్ డోస్చేట్, భారత మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్‌లను అసిస్టెంట్ కోచ్‌లగా గంభీర్ సెలక్ట్ చేశాడు.
కాగా ఈ త్రయం ఆధ్వర్యంలోనే ఐపీఎల్-2024 విజేతగా కేకేఆర్ నిలిచింది. ఇక ఈ టీ20 సిరీస్‌తో భారత హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్, కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ప్రస్థానం మొదలు కానుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది.
భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.
Comments
Please login to add a commentAdd a comment