పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 43 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్లెయింగ్ ఎలెవన్‌లో ఎంపిక చూసి మొదట అందరూ షాక్‌కు గురయ్యారు. అందుకు కారణం.. జింబాబ్వే సిరీస్‌లో దారుణంగా విఫలమైన రియాన్ పరాగ్‌కు ఈ మ్యాచ్ తుది జట్టులో చోటివ్వడమే.
ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్లు శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్‌లను పక్కన పెట్టి మరి పరాగ్‌కు ఛాన్స్ ఇచ్చిన జట్టు మెనెజ్‌మెంట్ చాలా మంది అగ్రహం వ్యక్తం చేశారు. కానీ పరాగ్‌కు తుది జట్టులో ఛాన్స్ ఇవ్వడం వెనక హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మాస్టర్ మైండ్ దాగి ఉందని మ్యాచ్ ఆఖరిలో అందరికి ఆర్దమైంది.
ఈ మ్యాచ్‌లో రియాన్‌ను పార్ట్‌టైమ్ బౌలర్‌గా ఉపయోగించాలని గంభీర్ ముందే నిర్ణయించుకున్నాడంట. అందుకే పరాగ్‌కే తొలి ప్రాధన్యతను గౌతీ ఇచ్చాడు. అయితే గౌతీ ప్లాన్ సూపర్ సక్సెస్ అయిందే అనే చెప్పుకోవాలి. బ్యాటింగ్‌లో విఫలమైన రియాన్ పరాగ్.. బౌలింగ్‌లో మాత్రం సత్తాచాటాడు.
వికెట్ కాస్త స్పిన్‌కు అనుకూలించడంతో లంక ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసేందుకు పరాగ్‌ను కెప్టెన్ సూర్యకుమార్ తీసుకువచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని పరాగ్ వమ్ము చేయలేదు. తన వేసిన తొలి ఓవర్‌లో కీలకమైన వికెట్‌ను భారత్‌కు అందించాడు.
ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో కేవలం 1.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన ఈ అస్సాం ఆల్‌రౌండర్.. 5 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. దీంతో గంభీర్ మాస్టర్ మైండ్ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదే కదా గౌతీ మార్క్ అంటే పోస్ట్‌లు పెడుతున్నారు.
Riyan Parag can Bowl Off Spin + Leg Spin just like Great Sachin Tendulkar used to Bowl 👏🏻
That's a Great News for Team India 🇮🇳 #INDvSL #RiyanParagpic.twitter.com/P0VjcDKEkf— Richard Kettleborough (@RichKettle07) July 28, 2024
Comments
Please login to add a commentAdd a comment