కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డే టై అయిన సంగతి తెలిసిందే. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను భారత్ టైగా ముగించింది. విజయానికి ఒక్క పరుగు కావాల్సిన నేపథ్యంలో భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ టై అయింది.
అయితే తొలి వన్డేలో చేసిన చిన్న చిన్న తప్పిదాలను రెండో వన్డేలో పునరావృతం చేయకూడదని భారత జట్టు యోచిస్తోంది. ఆదివారం కొలంబో వేదికగా జరగనున్న రెండో వన్డేలో మాత్రం ఎలాగైనా గెలిచి సిరీస్ ఆధిక్యంలోకి వెళ్లాలని టీమిండియా వ్యూహాలు రచిస్తోంది.
ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓ కీలక మార్పుతో బరిలోకి దిగనున్నట్లుట్లు తెలుస్తోంది. కొలంబో వికెట్ స్పిన్‌కు అనుకూలిస్తున్న నేపథ్యంలో ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌కు ఛాన్స్ ఇవ్వాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే స్ధానంలో పరాగ్ తుది జట్టులో వచ్చే అవకాశముందని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
రిషబ్ పంత్‌కు మరోసారి నో ఛాన్స్..?
ఇక ఈ మ్యాచ్‌కు కూడా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. వన్డేల్లో పంత్ కంటే కేఎల్ రాహుల్‌కు మంచి రికార్డు ఉండడంతో అతడి వైపే జట్టు మెనెజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్లు వినికిడి.
వన్డేల్లో రాహుల్‌కు 50పైగా సగటు ఉంది. అయితే దాదాపు 8 నెలల తర్వాత భారత జట్టులోకి రాహుల్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి వన్డేలో రాహుల్ తన మార్క్‌ను చూపించలేకపోయాడు. టైగా ముగిసిన మ్యాచ్‌లో రాహుల్ 31 పరుగులు చేసి ఔటయ్యాడు.
భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment