శ్రీలంకతో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వన్డేల్లో మాత్రం తమ మార్క్‌ను చూపించలేకపోతుంది. తొలి వన్డేలో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా టై చేసుకున్న భారత్.. రెండో వన్డేలో 32 పరుగుల తేడాతో అనుహ్యంగా ఓటమి చవిచూసింది.
ఈ క్రమంలో కీలకమైన మూడో వన్డేలో శ్రీలంకతో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. బుధవారం కొలంబో వేదికగా మూడో వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది.
మరోవైపు శ్రీలంక మాత్రం ఆఖరి మ్యాచ్‌లోనూ తమ జోరుని కొనసాగించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. కాగా భారత్‌పై శ్రీలంక వన్డే సిరీస్ గెలిచి దాదాపు 27 ఏళ్లు కావస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. మూడో వన్డేలో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
తొలి రెండు వన్డేల్లో తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయిన కేఎల్ రాహుల్, శివమ్ దూబేపై జట్టు మెనెజ్‌మెంట్ వేటు వేయనున్నట్లు సమాచారం. వారిద్దరి స్ధానంలో రిషబ్ పంత్, రియాన్ పరాగ్‌లకు చోటు ఇవ్వనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
కేఎల్ రాహుల్ వికెట్ల వెనక కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రెండో వన్డేలో ఈజీగా క్యాచ్‌లు విడిచి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే రిషబ్ పంత్‌ను బరిలోకి దించాలని గంభీర్, రోహిత్ శర్మ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.
Comments
Please login to add a commentAdd a comment