టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే దాదాపు నాలుగేళ్ల తర్వాత తిరిగి వన్డేల్లో పునరాగమనం చేశాడు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత తుది జట్టులో చోటు దక్కించుకున్న దూబే.. తన 1670 రోజుల నిరీక్షణకు తెరదించాడు. డిసెంబర్ 15, 2019న వెస్టిండీస్‌పై వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన దూబే.. తన మొదటి మ్యాచ్‌లో నిరాశపరిచాడు.
తన డెబ్యూ మ్యాచ్‌లో 6 బంతులు ఎదుర్కొన్న శివమ్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో ఆ తర్వాత అతడికి భారత జట్టులో చోటు దక్కలేదు. అయితే ఐపీఎల్-2024తో పాటు దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి భారత టీ20 జట్టులోకి వచ్చిన దూబే.. ఇప్పుడు వన్డేల్లో కూడా రీఎంట్రీ ఇచ్చాడు.
ముఖ్యంగా శ్రీలంకతో వన్డే సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం కావడంతో దూబేకు రీఎంట్రీ సుగమమైంది. తొలి వన్డేకు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా భారత తుది జట్టులో ఈ ముంబైకర్ చోటు దక్కించుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో కూడా దూబే పర్వాలేదన్పించాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 27 పరుగులు చేసిన దూబే.. భారత్ ఛాంపియన్స్‌గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. దూబే తన లిస్ట్-ఎ కెరీర్‌లో ఇప్పటివరకు 54 మ్యాచ్‌లు ఆడి 975 పరుగులతో పాటు 40 వికెట్లు పడగొట్టాడు.
తుది జట్లు..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్
శ్రీలంక: చరిత్ అసలంక (కెప్టెన్), పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కశాల్ మెండిస్ (వికెట్‌కీపర్), సధీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగ, జనిత్ లియనగే, అఖిల ధనంజయ, అషిత ఫెర్నాండో, మొహ్మద్ సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment