T20 World Cup 2021: Scotland Supporters Interrupt Bangladesh Skipper Mahmudullah Press Conference - Sakshi
Sakshi News home page

T20 WC 2021: అరె ఏంట్రా ఇది.. పాపం బంగ్లాదేశ్‌ కెప్టెన్‌... అసలు మాట్లాడనిస్తే కదా!

Published Mon, Oct 18 2021 5:38 PM | Last Updated on Wed, Oct 20 2021 4:50 PM

T20 WC: Scotland Supporters Interrupt Bangladesh Skipper Mahmudullah Press Conference - Sakshi

PC: ICC

Scotland supporters interrupt Bangladesh captain Mahmudullah:  టీ20 వరల్డ్‌కప్‌-2021 క్వాలిఫైయింగ్‌ పోటీల్లో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ రేపిన ఆదివారం నాటి మ్యాచ్‌లో బంగ్లా ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముష్ఫికర్‌ రహీం(38) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్‌ మహ్మదుల్లా(23), షకీబ్‌ అల్‌ హసన్‌(20) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు.

ఈ క్రమంలో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న బంగ్లా.. స్కాట్లాండ్‌ విధించిన 141 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ఫలితంగా మెగా టోర్నీ ఆరంభమైన మొదటిరోజే స్కాట్లాండ్‌ సంచలన విజయం నమోదు చేసింది. దీంతో.. ఆ జట్టుకు మద్దతుగా స్టేడియానికి వచ్చిన అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అంతా కలిసి తమ జాతీయ గీతం పాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. 

అయితే, వారి ఉత్సాహం బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మహ్మదుల్లాకు తలనొప్పి తెచ్చిపెట్టింది. మ్యాచ్‌ అనంతరం ఓటమిపై స్పందిస్తూ అతడు ఏదో చెప్పబోయేందుకు ప్రయత్నిస్తుండగా... స్కాట్లాండ్‌ ఫ్యాన్స్‌ కేరింతలు మరీ ఎక్కువయ్యాయి. దీంతో కాసేపు అతడు అలా మౌనంగా ఉండిపోయాడు. కాసేపటి తర్వాత మాట్లాడటం మొదలుపెట్టగానే మళ్లీ జాతీయగీలాపన ఆరంభించారు. దీంతో... చేసేదేమీ లేక మహ్మదుల్లా కాసేపు వెయిట్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ షేర్‌ చేయగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

చదవండి: T20 WC 2021 IRE Vs NED: 106 పరుగులకే ఆలౌట్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement