బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సంచలన క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 47 ఓవర్ వేసిన ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో మహ్మదుల్లా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో రాహుల్ కుడివైపు డైవ్ చేస్తూ ఒంటి చేతితో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.
దీంతో 77 పరుగులు చేసిన మహ్మదుల్లా నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. అప్పటికే మంచి టచ్‌లో ఉన్న మహ్మదుల్లాను రాహుల్ సూపర్ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపడం భారత్‌కు కాస్త ఊరట లభించింది. కాగా రాహుల్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సూపర్ మ్యాన్ అంటూ రాహుల్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కాగా బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో ఈజీ క్యాచ్‌ను జారవిడిచి మ్యాచ్ ఓటమికి కారణమైన రాహుల్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బంగ్లా బ్యాటర్ మెహాదీ హసన్ ఆజేయ శతకంతో చెలరేగాడు. 83 బంతులు ఎదుర్కొన్న మెహాదీ హసన్ 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 పరుగులు సాధించాడు.
What a catch it was by KL Rahul. pic.twitter.com/0gcTgNZQxy
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 7, 2022
చదవండి: BAN vs IND: మహ్మద్ సిరాజ్ అరుదైన రికార్డు.. తొలి భారత బౌలర్‌గా
Comments
Please login to add a commentAdd a comment