
కొలంబో : ముక్కోణపు సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి చెందడం కంటే కూడా జట్టు ఆడిన తీరుపై బంగ్లాదేశ్ కెప్టెన్ మొహ్మదుల్లా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. ఏ దశలోనూ తమ జట్టు నాణ్యమైన బ్యాటింగ్ చేయలేదన్నాడు. ఇంకా 30 నుంచి 40 పరుగులు చేయాల్సి ఉన్నా, సాధారణ స్కోరుకే పరిమితమయ్యాం. ప్రధానంగా మధ్య ఓవర్లలో ఎక్కువ డాట్ బాల్స్ పడ్డాయి.
కనీసం సింగిల్స్‌తో బ్యాటింగ్ రొటేట్ చేయడం కూడా కష్టమైంది. టీ 20ల్లో డాట్ బాల్స్ అనేవి చాలా తక్కువ శాతం ఉండాలి. మా ఇన్నింగ్స్‌లో 46 బంతులకు అసలు పరుగులే రాలేదు. ఇది మా ఓటమిపై తీవ్ర ప‍్రభావం చూపింది. ఇక్కడ మా ఓటమి కంటే కూడా ఆట తీరు బాలేదు. డాట్ బాల్స్‌పై ఇకనుంచైనా జాగ్రత్త పడాలి. బౌండరీలపై ఆధాపడవద్దు.. ఒత్తిడిని అధిగమించాలంటే సింగిల్స్ చాలా ప్రధానం' అని మొహ్మదుల్లా తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment