టీమిండియాతో రెండో వన్డేలో బంగ్లాదేశ్ బ్యాటర్లు మెహదీ హసన్ మిరాజ్, మహ్మదుల్లా అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన బంగ్లా బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. సిరాజ్, వాషింగ్టన్ సందర్ బంతితో మ్యాజిక్ చేయడం వల్ల బంగ్లాదేశ్ కేవలం 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ సమయంలో బంగ్లాదేశ్‌ను మెహదీ హసన్ మిరాజ్, మహ్మదుల్లా అదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఏడో వికెట్‌కు ఏకంగా 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్ద్దరి అద్భుత ఇన్నింగ్స్‌ల ఫలితంగా బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో మెహిదీ హసన్ అజేయ శతకంతో మెరవగా.. మహ్మదుల్లా 77 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పిన వీరిద్దరూ పలు రికార్డులను బద్దలు కొట్టారు.
మెహిదీ, మహ్మదుల్లా జోడీ సాధించిన రికార్డులు ఇవే
►భారత్‌తో వన్డేల్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన బంగ్లాదేశ్ జోడీగా మెహదీ హసన్, మహ్మదుల్లా రికార్డులకెక్కారు. అంతకుముందు 2014 ఆసియాకప్‌లో అనముల్ హక్, ముష్ఫికర్ రహీమ్ 133 పరగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తాజా మ్యాచ్‌తో ఈ రికార్డును మెహిదీ,, మహ్మదుల్లా జోడీ బద్దలు కొట్టింది.
►భారత్‌పై వన్డేల్లో 7వ వికెట్‌కు అత్యధిక నెలకొల్పిన జోడిగా మెహదీ హసన్, మహ్మదుల్లా నిలిచారు. అంతకముందు 2005లో దంబుల్లా వేదికగా జరిగిన వన్డేలో శ్రీలంక బ్యాటర్లు మహేల జయవర్ధనే, ఉపుల్ చందనా ఏడో వికెట్‌కు 126 పరుగుల పార్టనర్‌షిప్ నమోదు చేశారు. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. తాజమ్యాచ్‌లో ఈ 17 ఏళ్ల రికార్డును హసన్, మహ్మదుల్లా బ్రేక్ చేశారు.
►ఇక ఈ మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన మెహిదీ.. 8 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. అంతుకముందు 2021లో దక్షిణాఫ్రికాతో వన్డేలో ఐర్లాండ్ బ్యాటర్ సిమీ సింగ్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి శతకం బాదాడు.
చదవండి: IND vs BAN: మొన్న విలన్.. ఈ రోజు హీరో.. రాహుల్ స్టన్నింగ్ క్యాచ్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment