టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు సాధించాడు. ఆసియా కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (సెప్టెంబర్ 15) జరుగుతున్న మ్యాచ్‌లో మెహిది హసన్ మీరజ్ క్యాచ్ (వన్డేల్లో 91వ క్యాచ్) పట్టడం ద్వారా, హిట్‌మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లు) 200 క్యాచ్‌ల మార్కును అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్‌కు ముందు 34 మంది ఈ ఘనత సాధించారు. 449 మ్యాచ్‌ల్లో హిట్‌మ్యాన్ 200 క్యాచ్‌లు ఆందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక క్యాచ్‌లు (వికెట్‌కీపర్ కాకుండా) అందుకున్న రికార్డు లంక దిగ్గజం మహేళ జయవర్ధనే పేరిట ఉంది.
జయవర్ధనే 652 మ్యాచ్‌ల్లో మొత్తం 440 క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ జాబితాలో రోహిత్‌కు ముందు రాహుల్ ద్రవిడ్ (334), విరాట్ కోహ్లి (303), అజహారుద్దీన్ (261), టెండూల్కర్ (256) లాంటి భారత ఆటగాళ్లు ఉన్నారు.
ఇదిలా ఉంటే, కొలొంబో వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా పట్టుబిగించింది.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి భారత్ ఆహ్వనం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్.. 34 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. షకీబ్ 80 పరుగులు చేసి బంగ్లాదేశ్‌ను ఆదుకున్నాడు. షకీబ్, తంజిద్ హసన్ (13), లిటన్ దాస్ (0), అనాముల్ హాక్ (4), మెహిది హసన్ (13) ఔట్ కాగా.. తౌహిద్ హ్రిదోయ్ (40), షమీమ్ హొస్సేన్ క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టగా.. షమీ, అక్షర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment