
ICC Cricket World Cup 2023- Ind vs Ban: వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. 36 బంతులు ఎదుర్కొని 46 పరుగులు రాబట్టాడు.
బంగ్లాదేశ్ మిడిలార్డర్ కుప్పకూలిన వేళ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం(38)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. నిర్ణీత 50 ఓవర్లలో బంగ్లాదేశ్ 256 పరుగుల మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
అదిరే ఆరంభం ఇచ్చిన ఓపెనర్లు
ఇక పుణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లా ఓపెనర్లు తాంజిద్ హసన్, లిటన్ దాస్ అర్ధ శతకాలతో మెరిశారు. 51 పరుగులు సాధించిన తాంజిద్ తన అంతర్జాతీయ వన్డే కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అది కూడా టీమిండియా వంటి పటిష్ట జట్టు మీద.. అదీ వరల్డ్‌కప్ ఈవెంట్లో!!
మహ్మదుల్లా సరికొత్త చరిత్ర
ఇక లిటన్ దాస్(66)కు సైతం భారత జట్టు మీద వన్డేల్లో ఇదే తొలి అర్ధ శతకం. ఇలా వీరిద్దరు ఈ మ్యాచ్‌ను ప్రత్యేకంగా మార్చుకోగా.. ఫిఫ్టీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయినప్పటికీ మహ్మదుల్లా సరికొత్త చరిత్ర సృష్టించాడు.
అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా మహ్మదుల్లా రికార్డు
టీమిండియాతో మ్యాచ్‌లో మహ్మదుల్లా ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ చరిత్రలో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా మహ్మదుల్లా రికార్డు సాధించాడు.
ఇక భారత జట్టుతో గురువారం నాటి మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో మహ్మదుల్లా సిక్సర్లు బాదాడు. అయితే, ఆఖరి ఓవర్ రెండో బంతికి జస్‌ప్రీత్ బుమ్రా అద్భుత బంతితో మహ్మదుల్లాను బౌల్డ్ చేయడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది.
ప్రపంచకప్ టోర్నీల్లో ఇప్పటి వరకు బంగ్లాదేశ్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు వీరే!
1. మహ్మదుల్లా- 16
2. ముష్ఫికర్ రహీం- 13
3. షకీబ్ అల్ హసన్- 10.
చదవండి: Hardik Pandya Injury Update: టీమిండియాకు భారీ షాక్.. పాండ్యాకు గాయం.. బీసీసీఐ ప్రకటన