Jasprit Bumrah shares emotional video: టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మైదానంలో అడుగుపెట్టి దాదాపు ఏడాది కావస్తోంది. తీవ్రమైన వెన్నునొప్పి కారణంగా గతేడాది సెప్టెంబరు నుంచి జట్టుకు దూరమయ్యాడు. టీ20 ప్రపంచకప్-2022తో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్‌కు కూడా ఆడలేకపోయాడు. ఈ పేస్ గుర్రం అందుబాటులో లేకపోవడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది.
బుమ్రా ఎప్పుడెప్పుడు తిరిగి వస్తాడా అని మేనేజ్‌మెంట్‌తో పాటు అభిమానులు కూడా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వెన్ను నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకున్న బుమ్రా... ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. ఈ క్రమంలో బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు.
నిన్నటి బాధలన్ని ఆ వానలో కొట్టుకుపోనీ..
ఈ నేపథ్యంలో మంగళవారం ఓ ఎమోషనల్ వీడియోతో బుమ్రా అభిమానుల ముందుకు వచ్చాడు. అలెగ్జాండర్ జూనియర్ గ్రాంట్ రాసిన పాపులర్ సాంగ్ .. ‘‘I’m coming home..’’ బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తుండగా.. తాను బంతితో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు పంచుకున్నాడు.
‘‘నేను తిరిగి వస్తున్నా.. నేను వచ్చేస్తున్నా.. ఈ ప్రపంచానికి ఈ విషయాన్ని చెప్పండి.. నేను వచ్చేస్తున్నా.. నిన్నటి బాధలన్ని ఆ వానలో కొట్టుకుపోనీ..
నా కోసం నా రాజ్యం ఎదురు చూస్తోంది.. వాళ్లు నా తప్పులన్నీ క్షమించేశారు.. నేను వచ్చేస్తున్నా అని వాళ్లకు చెప్పండి’’ అన్న అర్థంలో ఉద్వేగభరితంగా సాగే పాటతో తన మనసులోని భావాలను చెప్పకనే చెప్పాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
బుమ్రా వీడియోపై స్పందించిన బీసీసీఐ
‘‘త్వరగా వచ్చెయ్ బుమ్రా భాయ్.. నీకోసం వెయిటింగ్’’ అంటూ అభిమానులు అతడికి స్వాగతం పలుకుతున్నారు. ఇక బీసీసీఐ సైతం బుమ్రా వీడియోపై స్పందిస్తూ.. ‘‘టీమిండియాలో నీ పునరాగమనం కోసం ఇంకా ఎదురుచూడలేం.. త్వరగా వచ్చెయ్’’ అని పేర్కొనడం గమనార్హం. కాగా అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా ఆరంభం కానున్న వన్డే వరల్డ్‌కప్- 2023 నాటికి బుమ్రా జాతీయ జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
వన్డే వరల్డ్‌కప్ నాటికి
ఒకవేళ త్వరగా కోలుకున్నట్లయితే ఆగష్టు 18 నుంచి ఆరంభం కానున్న ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో కూడా అతడు భాగమయ్యే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉంటే.. టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. జూలై 12- ఆగష్టు 13 వరకు ఈ టూర్ సాగనుంది. ఇందులో భాగంగా మొదటి టెస్టులో గెలుపొందిన రోహిత్ సేన జూలై 20 ఆరంభం కానున్న రెండో టెస్టుకు సిద్ధమవుతోంది.
చదవండి: ఐపీఎల్‌లో సెంచరీ సాధించిన అనామక క్రికెటర్ రిటైర్మెంట్
టీమిండియాతో రెండో టెస్టు.. వెస్టిండీస్ జట్టు ప్రకటన! యువ సంచలనం ఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment